Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ప్రతీ స్త్రీ నిపుణత గల వంటగత్తె అవ్వటం తన విధి

    (1870) 2T 370 CDTel 259.1

    372. మన సహోదరీలు చాలామందికి వంటచెయ్యటం రాదు. అలాంటి వారితో నేనంటాను మీ ప్రాంతంలో ఉన్న ఉత్తమ వంటకత్తె వద్దకు వెళ్లి అవసరమైతే వారాలు తరబడి ఆమెతో ఉండి, వంటకళలో నిపుణత సాధించమని. నేను నలభై సంవత్సరాల వయసుగల దాన్ని అయితే తెలివితేటలు, నైపుణ్యత గల వంటకత్తె కమ్మని వంటను నేర్చుకోటానికి ఇదే పని చేస్తాను. వంటచెయ్యటం నేర్చుకోటం మీ విధి. మీరు మీ కుమార్తెలకి వంట చెయ్యటం నేర్పటం మీ విధి. మీ కుమార్తెలకి వంటచేసే కళను నేర్పుతున్నప్పుడు సామాన్యంగా వారు లోనయ్యే అజ్ఞానం నుంచి, దుష్టత నుంచి వారిని కాపాడే రక్షావలయాన్ని మీరు వారి చుట్టూ నిర్మిస్తున్నారు.CDTel 259.2

    [C.T.B.H.49] (1890) C.H.177 CDTel 259.3

    373. వంట ఎలా చెయ్యాలో నేర్చుకోటానికి స్త్రీలు చదవాలి, ఆ తర్వాత తాము నేర్చుకున్నది సహనంతో అభ్యాసం చెయ్యాలి. కష్టపడి ఇది చెయ్యనందువల్ల ప్రజలు బాధపడుతున్నారు. అట్టివారితో నేనంటాను, నిద్రాణమై ఉన్న మీ శక్తుల్ని మేల్కొల్పి, జ్ఞానం సంపాదించండి. ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం తయారు చెయ్యటంలో జ్ఞానం అనుభవం సంపాదించటానికి గడిపే సమయం వ్యర్ధమైన సమయమని తలంచవద్దు. వంట చెయ్యటంలో మీకెంత దీర్ఘానుభవం ఉన్నప్పటికీ మీకింకా కుటుంబ సంరక్షణ బాధ్యతలుంటే, వారిని ఎలా సరిగా సంరక్షించాలో నేర్చుకోటం మీ విధి.CDTel 259.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents