Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అందరూ పరీక్షించబడుతున్నారు.

    (R.& H. ఫిబ్ర. 10, 1910) CDTel 25.3

    38. వ్యక్తిగతంగా మనం మన పాత్రను సరిగా నిర్వహించి ఏమి తినాలి? ఏమి తాగాలి? అన్న విషయంలోనూ, మన ఆరోగ్యాన్ని కాపాడుకోటానికి ఎలా నివసించాలి? అన్న విషయంలోనూ వివేకవంతమైన అవగాహన కలిగివుండటం చాలా ప్రాముఖ్యం. ఆరోగ్య సంస్కరణ నియమాల్ని ఆచరిస్తారో లేక సొంత ఆశలు కోరికలు నెరవేర్చుకోటానికి చూస్తారో నిగ్గుతేల్చటానికి అందరూ పరీక్షించబడుతున్నారు.CDTel 25.4

    ఆహారం విషయంలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చని ఎవరూ తలంచకుందురు గాక! అయితే దేవునికి మహిమ కలిగే...ట్లు, అన్ని విషయాల్లో లాగ భోజన విషయంలోనూ మీరు నియమాల్ని ఆచరిస్తారని మీతో భోజనానికి కూర్చున్నవారి ముందు కనపర్చండి. మీరు మరో విధంగా ప్రవర్తించలేరు. ఎందుకంటే మీరు భావి నిత్యజీవానికి మీ ప్రవర్తనను నిర్మించుకోవలసి ఉంది. ప్రతీ మానవాత్మ మీద గొప్ప బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతల్ని అవగాహన చేసుకుని ప్రభువు నామంలో వాటిని ఉత్తమంగా నిర్వహించాలి.CDTel 25.5

    భోజనం విషయంలో శోధించబడే ప్రతివారికి నేను పలికే హితవు ఇది : శోధనకు లొంగకండి; ఆరోగ్యకరమైన ఆహారానికే పరిమితమై ఉండండి. ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని భుజించి ఆనందించటానికి మిమ్మల్ని మీరు తర్బీతు చేసుకోవచ్చు. తమకు తాము సహాయం చేసకోటానికి పాటుపడే వారికి దేవుడు సహాయం చేస్తాడు. కాని దేవుని చిత్తాన్ని అనుసరించటానికి మనుషులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనప్పుడు ఆయన వారితో ఎలా పనిచెయ్యగలడు? భయంతోను వణకుతోను మన రక్షణకు కృషిచేస్తూ, మన దేహాలను కాపాడుకోటంలో పొరపాట్లు ఏమైనా జరుగుతాయేమోనన్న భయంతో మన పాత్రను పోషిస్తూ మన దేహాన్ని మిక్కిలి ఆరోగ్యదాయకమైన స్థితిలో ఉంచుకోటానికి మనం దేవునికి బాధ్యులం.CDTel 26.1