Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆరోగ్య సంస్కరణ; వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన

    (1909) 9T 164,165 CDTel 14.1

    27. పరిశుద్ధులై, పరిశుద్ధులుగా ఉండటానికి సెవెంతుడే ఎడ్వంటిస్టులు తమ హృదయాల్లోను తమ గృహాల్లోను పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఈ నాటి ఇశ్రాయేలు అయిన దైన ప్రజలు దేవుని ముందు దీన హృదయులై ఆత్మాలయాన్ని సమస్త దుర్నీతి నుంచి శుద్ధిచేసుకున్నప్పుడు, రోగుల విషయమై వారు చేసే ప్రార్థనలు విని వ్యాధి నివారణలో తన పరిహారసాధనాల్ని ఆశీర్వదిస్తానని నాకిచ్చిన వెలుగులో దేవుడు విశదం చేశాడు. దేవుడు ఏర్పాటుచేసిన సామాన్య చికిత్సాపద్ధతుల్ని ఉపయోగించి, వ్యాధిని ప్రతిఘటించటానికి మానవ సాధనం తాను చేయగలిగినదంతా విశ్వాసంతో చేసినప్పుడు అతడి కృషిని దేవుడు ఆశీర్వదిస్తాడు.CDTel 14.2

    ఇంత వెలుగు పొందిన తర్వాత దైవ ప్రజలు చెడు అలవాట్లను అనుసరిస్తూ, స్వార్థకోరికలు నెరవేర్చుకుంటూ, దిద్దుబాటును తిరస్కరిస్తే? వారు అతిక్రమణ పర్యవసానాల్ని అనుభవించక తప్పదు. ఆరు నూరైనా వక్రమైన తిండివాంఛ తీర్చుకోటానికే వారు కృతనిశ్చయులైతే, తమ చెడు తిండి సర్యవసానాలనుంచి వారిని కాపాడటానికి దేవుడు అద్భుతాలు చెయ్యడు. వారు “వేదనగలవారై పండుకొనెదరు” యెషయా 50:11.CDTel 14.3

    “ప్రభువు నన్ను స్వస్తపర్చాడు. నేను మితం పాటించవలసిన అనసరం లేదు. నా ఇష్టం వచ్చినట్లు తినవచ్చు, తాగవచ్చు” అని ఊహించటాన్ని ఎంపిక చేసుకునేవారికి కొద్దికాలంలోనే శరీరాత్మల్లో దేవుని పునరుద్ధరణ శక్తి అవసరమౌతుంది. దేవుడు మిమ్మల్ని కరుణించి స్వస్తపర్చాడు గనుక స్వార్థాశలు వ్యసనాలు నెరవేర్చుకునే లౌకిక అభ్యాసాల్ని అనుసరించాలని మీరు భావించకూడదు. స్వస్తపర్చిన తర్వాత “నీవు వెళ్లి ఇక పాపము చేయకుము” అని క్రీస్తు ఆజ్ఞాపించినట్లు చెయ్యండి. (యోహాను 8:11) తిండే మీకు దేవుడు కాకూడదు.CDTel 14.4

    (1867) 17 560,561 CDTel 15.1

    28. ఆరోగ్య సంస్కరణ, తన ప్రజల క్షేమాభివృద్ధి నిమిత్తం దేవుడు రూపొందించిన ప్రత్యేక పరిచర్యలో భాగం......CDTel 15.2

    మనలో వ్యాధిగ్రస్తుల నిమిత్తం తన సేవకుల ప్రార్థనల్ని దేవుడు మరింత సంపూర్ణంగా వినకపోవటానికి కారణం వారు ఆరోగ్య చట్టాల్ని అతిక్రమిస్తూ ఆయన్ని మహిమ పర్చలేక పోటమేనని నేను దర్శనంలో చూశాను. విశ్వాస ప్రార్థనకు పూర్తి ప్రతిఫలం ఇవ్వటానికి మార్గం సరాళం చెయ్యటానికి ఆయన ఆరోగ్య సంస్కరణను, ఆరోగ్య సంస్థ ను రూపొందించాడని కూడా దర్శనంలో చూశాను. మన మధ్య ఉన్న వ్యాధిగ్రస్తుల వ్యాధి నివారణలో, ఇక్కడ దేవున్ని మహిమ పర్చటానికి, క్రీస్తు వచ్చినప్పుడు రక్షించబడటానికి యోగ్యుల్ని చెయ్యటంలో విశ్వాసం సృ్కయలు కలిసిసాగాలి.CDTel 15.3

    (1864) Sp.Gifts Iv, 144,145 CDTel 15.4

    29. తాము దేవున్ని వేడుకున్నారు గనుక తమను వ్యాధి బారిన పడకుండా ఆయన కాపాడ్డాడని అనేకమంది కనిపెట్టారు. అయితే దేవుడు వారి ప్రార్థనల్ని పరిగణించలేదు. ఎందుకంటే వారి విశ్వాసం క్రియల ద్వారా పరిపూర్ణం కాలేదు. తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోకుండా వ్యాధి రాకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోటానికి ప్రయత్నించకుండా ఆరోగ్య చట్టాల్ని అతిక్రమించే వారిని జబ్బుపడకుండా కాపాడటానికి దేవుడు అద్భుతాలు చెయ్యడు. ఆరోగ్యంగా ఉండటానికి మన వంతుగా మనం చెయ్యగలిగనదంతా చేసినప్పుడు, అప్పుడు మనం ఆశించిన ఆ మంచి ఫలం వస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోటానికి మన కృషిని దీవించమని మనం దేవున్ని విశ్వాసంతో వేడుకోవచ్చు. అప్పుడు ఆ కార్యంద్వారా తన నామానికి మహిమ కలుగుతుంటే ఆయన మన ప్రార్థనను సఫలం చేస్తాడు. అయితే తాము చేయాల్సిన పని ఉన్నదని అందరూ గ్రహించాలి. ఆరోగ్య చట్టాల్ని అలక్ష్యం చెయ్యటంద్వారా వ్యాధి కలిగించే మార్గాన్ని అవలంబించే వ్యక్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి దేవుడు అద్భుత రీతిగా పనిచెయ్యడు.CDTel 15.5

    తిండి వాంఛ తృప్తిపర్చుకుంటూ ఆనక అమితమైన తిండి వల్ల కలిగే వ్యాధుల్ని నివారించుకోటానికి చూసేవారు తాము అంత నిర్లక్ష్యంగా తమ మీదికి తెచ్చుకున్న అనారోగ్యం నుంచి తమను కాపాడటానికి దేవుడు కలుగజేసుకోడని గుర్తుంచుకోవాలి. కారణం దాని ఫలితాన్ని కలిగిస్తుంది. అనేకులు తమ చివరి ప్రయత్నంగా దైవ వాక్య సూచనల్ని అనుసరించి తమ ఆరోగ్య పునరుద్ధరణకు సంఘ పెద్దల ప్రార్థనల్ని అర్థిస్తారు. అలాంటివారి పక్షంగా చేసే ప్రార్థనల్ని సఫలం చెయ్యటానికి దేవుడు విముఖుడు. ఎందుకంటే, వారికి ఆరోగ్యాన్ని పునరుద్ధరించటం జరిగితే వారు దాన్ని మళ్ళీ చెడు తిండి బలిపీఠం పై బలి ఇస్తారని ఆయనకు తెలుసు. CDTel 16.1

    [713 కూడా చూడండి] CDTel 16.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents