Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆరోగ్యసంస్కరణ నియమాల బోధనలో ప్రారంభ కృషి

    763. బేటిల్ క్రీక్ లో (1864 లో) ఓ రాష్ట్ర సంత ఏర్పాటు చేసినపుడు మన ప్రజలు సంత స్థలంలోకి మూడు నాలుగు వంట స్టన్లు తీసుకు వెళ్లి, మాంసం ఉపయోగించకుండానే మంచి ఆహారం ఎలా తయారు చెయ్యవచ్చో అక్కడి ప్రజలకు చూపించారు. ఆ స్థలంలో తయారుచేయబడ్డ ఆహారమంతటిలో మంది అత్యుత్తమమని నిర్వాహకులు మెచ్చుకున్నారు. పెద్ద పెద్ద సమావేశాలు జరిగేటప్పుడు, హాజరయ్యే వారికి ఆరోగ్యమైన ఆహారం తయారు చేసి సరఫరా చెయ్యటానికి ప్రణాళికలు తయారు చెయ్యటం మీ ఆధిక్యత. మీరు మీ కృషిని విజ్ఞానదాయకం చెయ్యాలి.CDTel 460.6

    దైవానుగ్రహం వల్ల మాకు ప్రజల ఆదరణ లభించింది. ఎవరి విషయంలో బతికే అవకాశం ఏ మాత్రం లేదని వైద్యులు ప్రకటించారో అలాంటి వారికి ఆరోగ్యసంస్కరణ సూత్రాల ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్ధరించటానికి మాకు అనేక అద్భుతమైన తరుణాలు లభించాయి.....CDTel 461.1