Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఇశ్రాయేలు విషయంలో దేవుని సంకల్పం

    (1890) C.T.B.H.118,119 CDTel 390.1

    644. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోనుంచి నడిపించినప్పుడు వారిని కనానులో పవిత్రమైన, ఆనందం, ఆరోగ్యం గల ప్రజలుగా స్థాపించాలని దేవుడు సంకల్పించాడు. ఈ కార్యాన్ని ఏ విధంగా సాధిస్తాడన్న దాన్ని పరిశీలిద్దాం. ఆయన వారిని కఠిన క్రమశిక్షణకు గురిచేశాడు. వారు దాన్ని జాగ్రత్తగా అవలంబించి ఉంటే అది వారికీ వారి సంతతకీ గొప్ప మేలుచేసేది. వారినుంచి మాంసాన్ని చాలా మట్టుకు తీసివేశాడు. వారు పెట్టిన గోలకు సమాధానంగా సీనాయి చేరకముందు ప్రభువు వారికి మాంసాన్నిచ్చాడు. కాని దాన్ని ఒక రోజు మాత్రమే ఇచ్చాడు. మన్నానిచ్చినంత సులువుగానే మాంసాన్ని దేవుడిచ్చేవాడే. కాని తమ మేలు కోరే దేవుడు ప్రజల పై ఆంక్ష విధించాడు. తమలో అనేకులు ఐగుప్తులో అలవాటుపడ్డ ఉద్రేకభరిత ఆహారం కన్నా మెరుగైన, తమ అవసరాలకి మరింత అనుగుణమైన, ఆహారం వారికి సమకూర్చటం ఆయన సంకల్పం. మానవుడికి ఆదిలో ఏర్పాటైన, ఏదెనులో ఆదామవ్వలకి దేవుడిచ్చిన భూఫలాల ఆహారాన్ని తిని ఆనందించేందుకు మానవుల వక్రరుచిని మరింత ఆరోగ్యదాయక స్థితికి తీసుకురావలసి ఉంది.CDTel 390.2

    నిర్బంధాలకి విధేయులై తమ తిండి ఆ పేక్షని ఉపేక్షించి ఉంటే వారి మధ్య బలహీనత, వ్యాధి ఎన్నడూ ఉండేవి కాదు. వారి సంతతి వారికి శారీరక, మానసిక శక్తి ఉండేది. సత్యం విషయంలోను, తమ విధి విషయంలోను వారికి స్పష్టమైన అవగాహన, చురుకైన విచక్షణ, వివేకం ఉండేవి. కాని వారు దేవుని న్యాయ విధులకి విధేయంగా నివసించటానికి నిరాకరించి, ఆయన నియమించిన ప్రమాణాన్ని చేరలేకపోయారు. దేవుడు విధించిన నిర్బంధాల గురించి వారు గొణుగుకుని ఐగుప్తులో తాము తిన్న మాంసాన్ని వాంఛించాడు. దేవుడు వారికి మాంసం ఇచ్చాడు. కాని అది వారికి శాపంగా పరిణమించింది.CDTel 390.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents