Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆత్మనిగ్రహం ఆవశ్యకత

    (1905) M.H.129,130 CDTel 68.2

    100. తొలి మత భ్రష్టత మిక్కిలి శోచనీయ ఫలితాల్లో ఒకటి మానవుడు ఆత్మ నిగ్రహశక్తిని కోల్పోటం. ఈ శక్తిని తిరిగి సంపాదించినప్పుడే నిజమైన పురోభివృద్ధి సాధ్యమౌతుంది.CDTel 68.3

    ప్రవర్తన నిర్మాణానికి మనసు ఆత్మ శరీర మాధ్యమం ద్వారానే వృద్ధి చెందుతాయి. అందుకే ఆత్మల విరోధి అయిన సాతాను శారీరకశక్తుల్ని బలహీనపర్చి భ్రష్టం చెయయటానికి తన శోధనల్ని సంధిస్తాడు. ఇక్కడ అతడు విజయం సాధించటమంటే మనిషి యావత్తూ దుర్మార్థతకు లొంగిపోటం. ఉన్నతశక్తి ఆధీనంలో ఉంటే తప్ప మన భౌతిక స్వభావ ప్రవృత్తులు మనకు దుస్థితిని మరణాన్ని కలిగించటం తథ్యం.CDTel 68.4

    శరీరాన్ని వశపర్చుకోవాలి. జీవిని ఉన్నత శక్తులు పరిపాలన చెయ్యాలి. ఉద్రేకాలు ఆవేశాలు చిత్తం అదుపులోను చిత్తం దేవుని అదుపులోను ఉండాలి. దైవకృప ద్వారా పరిశుద్ధమైన ఆలోచనా శక్తి మనల్ని నడిపించాలి.CDTel 68.5

    దేవుని న్యాయవిధుల్ని మనస్సాక్షికి సుబోధకం చెయ్యాలి. ఆత్మనిగ్రహ విధిని, పరిశుద్ధత అవసరాన్ని, వక్రతిండి వాంఛనుంచి, అపవిత్ర అలవాట్లు అభ్యాసాలనుంచి విముక్తి ఆవశ్యకతను, గుర్తించటానికి పురుషులు స్త్రీలు మేల్కోవాలి. తమ మానసిక, శారీరక శక్తులన్నీ దేవుని వరాలని, వాటిని దైవ సేవ నిమిత్తం అత్యుత్తమ స్థితిలో కాపాడుకోవాలని వారు గుర్తుంచుకోటం అవసరం.CDTel 68.6