Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    లేఖన అధ్యయనానికి సిద్దబాటుగా

    (1870) 2T 692 CDTel 190.1

    299. లేఖనాల్లోని కొన్ని సంగతులు గ్రహించటం కష్టం. పేతురు అంటున్నట్లు, వాటిని విద్యాహీనులు, అస్థిరులు తమ సొంత నాశనానికి అపార్థం చేసుకుంటారు. ప్రతీ లేఖన భాగాన్ని ఈ జీవితంలో మనం విశదీకరించలేకపోవచ్చు కాని సత్యానికి ప్రాముఖ్యమైన విషయాలేవీ మర్మగర్భితం కావు.CDTel 190.2

    దేవుని కృపలో, ఆ కాలానికి దేవుడిచ్చిన సత్యం పై లోకాన్ని పరీక్షించాల్సిన సమయం వచ్చినప్పుడు, లింకు తర్వాత లింకును వెదకి, సంపూర్ణమైన గొలుసుగా ఏకమయ్యే వరకు ఉపవాస ప్రార్థనతో లేఖనాల్ని పరిశోధించటానికి దేవుని ఆత్మమనసుల్ని చైతన్యపర్చుతాడు.CDTel 190.3

    ఎవరూ పొరపడనవసరం లేకుండా లేదా చీకటిలో నడవాల్సిన అవసరం లేకుండా ఆత్మల రక్షణకు సంబంధించిన ప్రతీ విషయం విశదం చెయ్యబడుతుంది.CDTel 190.4

    (1870) 2T 650,651 CDTel 190.5

    300. అంకిత భావం గల కొందరి కృషిద్వారా ప్రస్తుత కాలపు సత్యంలోని కష్టమైన సంగతులను గ్రహించటం జరిగింది. వారు ఉపవాసముండి ప్రార్థన చేసినందువల్ల సత్య సిరుల అవగాహనను ప్రభువు వారికి అనుగ్రహించాడు.CDTel 190.6

    (R.& H., జూలై 26, 1892) L.& T.47 CDTel 191.1

    301. సత్యాన్ని యధార్థంగా ఆకాంక్షించేవారు పరిశోధన పట్ల విమర్శ పట్ల తమ వైఖరిని వెల్లడి చెయ్యటానికి విముఖంగా ఉండరు. తమ ఉద్దేశాల్ని అభిప్రాయాల్ని తిరస్కరించటం జరిగినప్పుడు ఆక్రోశించరు. ఇలాంటి స్వభావం మనమధ్య నలభై ఏళ్ల క్రితం ఉండేది. హృదయభారంతో సమావేశమై, విశ్వాసంలో, సిద్ధాంతంలో ఒకటి కావాలని ప్రార్థన చేసేవాళ్లం. ఎందుకంటే క్రీస్తు విభజింపబడలేదు. ఒక అంశమే ఒకసారి పరిశీలించటం జరిగేది. సత్యాన్ని అవగాహన చేసుకునేందుకు యోగ్యులమవ్వటానికి తరచుగా ఉపవాసం చేసేవాళ్లం.CDTel 191.2