Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    మాంస పదార్థాలు ఆసుపత్రి భోజనంలో భాగం కావు

    ఉత్తరం 371904 CDTel 299.5

    431. మన ఆసుపత్రుల్లో మాంసం ఉపయోగించటం గురించి నాకు ఉపదేశం వచ్చింది. మాంసాహారం తిన కూడదు. దాని బదులు ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం తీసుకోవాలి. దాన్ని నోరూరించే విధంగా తయారుచెయ్యాలి.CDTel 299.6

    ఉత్తరం 45, 1903 CDTel 300.1

    432. సోదరుడు, సోదరీ----- మన వైద్య సంస్థలోని భోజనబల్లల పై నుంచి మాంసపదార్థాల్ని విసర్జించటానికి సంబంధించి మొదట సమస్యలు లేచిన తరుణంనుంచీ నాకు బయలు పర్చబడ్డ కొన్ని విషయాలు మీ పరిగణనకి సమర్పించగోరుతున్నాను..... CDTel 300.2

    మన ఆసుపత్రుల భోజనశాల్లో రోగులముందు మాంసాహారం పెట్టకూడదని ప్రభువు నాకు స్పష్టమైన ఉపదేశమిచ్చాడు. ప్రార్థనహాలులోని ప్రసంగం విన్న తర్వాత కూడా రోగులు మాంసపదార్థాలు కావాలని కోరితే వారికి వాటిని ఇవ్వాలని అయితే వారు వాటిని భోజన శాలలో గాక తమ గదుల్లో తినాలని ప్రభువు నాకు తెలియజేశాడు. సహాయకులందరూ మాంసాహారం విసర్జించాలి. కాగా ముందు చెప్పిన విధంగా మాంసం, మాంస పదార్థాల్ని భోజనశాలల్లోని భోజనబల్లల మీద పెట్టరాదని ఎరిగికూడా కొందరు రోగులు మాంసం కావాలని కోరితే, దాన్ని ఆనందంగా వారికి వారి గదుల్లో వడ్డించండి.CDTel 300.3

    అనేకమంది మాంసాహారానికి అలవాటు పడ్డవారు కావటంతో వారు మాంసం భోజనశాల భోజనబల్లల పై ఉంచాలని ఎదురుచూడటంలో ఆశ్చర్యం లేదు. బల్లలపై ఇచ్చే ఆహారపదార్థాల జాబితా ఇవ్వటం మంచిది కాదు. ఎందుకంటే భోజనపదార్థాల్లో మాంసం లేకపోటం ఆసుపత్రి పోషకులు అవ్వాలని ఆలోచిస్తున్న వారికి ఓ పెద్ద ప్రతిబంధకంగా కనిపించవచ్చు.CDTel 300.4

    ఆహారాన్ని రుచిగా తయారు చేసి చక్కగా వడ్డించాలి. మాంస పదార్థాలు వడ్డిస్తుంటే, అవసరమైన వాటికన్నా ఎక్కువ వంటకాలు తయారు చెయ్యాలి. మాంసం తొలగించటానికి ఇతర వంటకాల్ని తయారు చెయ్యవచ్చు. కొందరు పాలు, వెన్న కోరవచ్చు.CDTel 300.5