Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    కొత్త కేంద్రాల) స్థాపించండి

    (1904) 8T 148 CDTel 477.1

    786. తమ సేవా పరిధికి అవతల ఉన్న ప్రాంతాల్లో ప్రవేశించటం దైవ ప్రజల విహిత కర్తవ్యం. నూతన స్థలాన్ని శుభ్రంచెయ్యటానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందో అక్కడ ప్రభావవంతమైన కొత్త కేంద్రాల్ని స్థాపించటానికి సేవా దళాలు పని ప్రారంభించాలి. మిషనరీ సేవ చెయ్యటానికి ఉత్సాహం కలవారిని సంఘటిత పర్చి వెలుగుని జ్ఞానాన్నిCDTel 477.2

    వెదజల్లటానికి వారిని అన్నిచోట్లకు పంపండి. ఈ సూత్రాల విషయంలో చాలామట్టుకు అజ్ఞానంలో ఉన్నవారి సమాజాల్లోకి వారు ఆరోగ్యసంస్కరణ నియమాల్ని తీసుకు వెళ్లాలి. వారు తరగతులు ఏర్పాటు చేసి వ్యాధికి చికిత్సను గూర్చిన ఉపదేశం అందించాలి.CDTel 477.3

    (1909) 9T 36,37 CDTel 477.4

    787. స్త్రీలకు, పురుషులకు విశాల సేవారంగం ఉంది. నిపుణతతో వంట చేసే స్త్రీ, కుట్టుపని చేసే స్త్రీ, నర్చు- వీరి సహాయం అవసరం లేని వారుండరు. బడుగు కుటుంబాలకు చెందిన వారు వంట చెయ్యటం, తమ దుస్తులు కుట్టుకోటం, మరమ్మత్తు చేసుకోటం, జబ్బుగా ఉన్నవారికి సేవలందించటం, ఇంటిని చక్కబర్చుకోటం నేర్చుకోవాలి. తమకన్నా పేద స్థితిలో ఉన్నవారికి చిన్న చిన్న పనులు చేసి పెట్టటానికి చిన్నపిల్లలకి సైతం నేర్పించాలి. CDTel 477.5