Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    నీటివాడకం - సరైనది, సరికానిది

    (R.& H. జూలై, 29,1884) CDTel 437.3

    731. అనేకులు భోజనం చేసేటప్పుడు చల్లని నీళ్లు తాగుతారు. అది పొరపాటు. భోజనంతో తీసుకునే నీళ్లు లాలాజల గ్రంధుల ద్రవాల ప్రవాహాన్ని తగ్గిస్తాయి. నీళ్లు ఎంత చల్లనివైతే కడుపుకి అంత హాని జరుగుతుంది. భోజనంతో తీసుకునే ఐసు నీళ్లు లేక ఐస్ లెమనేడ్ కడుపు తన పనిని మళ్లీ చేపట్టటానికి చాలినంత వేడిని శరీర వ్యవస్థ సమకూర్చే వరకు జీర్ణ క్రియను ఆపుచేస్తుంది. వేడి పానీయాలు దుర్బలత పుట్టిస్తాయి. అంతేకాక వాటికి అలవాటు పడేవారు ఆ అలవాటుకి బానిసలవుతారు. ఆహారాన్ని కడుపులోకి కడిగి వెయ్యకూడదు. భోజనాలతో ఎలాంటి పానీయం అవసరం లేదు. నెమ్మదిగా తిని తద్వారా లాలాజలం ఆహారంతో కలిసిపోటానికి తోడ్పడండి. భోజనంతో ఎంత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటే ఆహారం జీర్ణమవ్వటం అంత కష్టమౌతుంది. ఎందుకంటే ద్రవ పదార్ధం ముందు విలీనమవ్వాలి. ఉప్పు ఎక్కువ తినవద్దు. పచ్చడి సీసాల జోలికి పోవద్దు. కారం, మసాలాల వల్ల మంట పుట్టించే ఆహారాన్ని కడుపులోకి పంపకండి. భోజనాలతో పండ్లు తినండి. పానీయాన్ని కోరే మంట మాయమౌతుంది. దాహం తీర్చుకోటానికి ఏదైనా కావలసివస్తే భోజనానికి కాస్త ముందో కాస్త వెనకో శుద్ధమైన నీటిని తాగటమే ప్రకృతి కణాల్ని శుభ్రం చెయ్యటానికి నీళ్లు ఉత్తమం.CDTel 437.4

    [భోజనాలతో పానీయాలు తీసుకోటం గురించి ఎక్కువ ఉపదేశం - 165,166] CDTel 438.1

    [దేవుని ఔషధాల్లో ఒకటి-451,452,454]CDTel 438.2