Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    టీ, కాఫీ, మాంసాహారానికి చికిత్సాదేశం ఇవ్వకూడదు

    1896) E. from U.T. 4,5 CDTel 305.3

    438. రోగులకి మాంసాహారం చికిత్సాదేశంగా ఇవ్వటానికి వైద్యులుకి ఉద్యోగమివ్వటం లేదు. ఎందుకంటే ఈ రకమైన ఆహారమే వారిని వ్యాధిగ్రస్తుల్ని చేస్తుంది. ప్రభువుని వెదకండి. ఆయన దొరికినప్పుడు మీరు సాత్వికులు దీన హృదయులు అవుతారు. వ్యక్తిగతంగా మీరు చచ్చిన జంతువుల మాంసం తినరు. అలాంటిది ఒక ముద్దకూడా మీ పిల్లల నోళ్లలో పెట్టరు. మీ రోగులకి టీ, కాఫీ మాంసాహారానికి చికిత్సాదేశాలివ్వరు. కాని సామాన్యాహార ఆవశ్యకతను చూపిస్తూ సమావేశ హాల్లో ఉపన్యాసాలిస్తారు. మీ భోజన పదార్థాల పట్టిక నుంచి హానికర పదార్థాల్ని తొలగిస్తారు.CDTel 305.4

    ప్రభువు ఉపదేశాన్ని సంవత్సరాలుగా పొందిన తర్వాత, మన వైద్య సంస్థల్లోని వైద్యులు తమ మాటలు చేతల ద్వారా తమ ఆలనాపాలన కింద ఉన్న రోగులకి మాంసాహారం నేర్పించటం మన ఆరోగ్య సంస్థల అధిపతులుగా వ్యవహరించటానికి వారిని అపాత్రుల్ని చేస్తుంది. బాధ్యత ప్రభావం అధికారం గల స్థానాల్లో ఉన్నవారు అలక్ష్యం చెయ్యటానికి ప్రభువు ఆరోగ్యసంస్కరణ పై వెలుగునివ్వడు. ప్రభువు చెప్పేదంతా ప్రాముఖ్యమైంది. ఆయన ఏమి చెప్పుతాడో దానిలో ఆయన్ని ఘనపర్చాలి. ఈ అంశాల పై వెలుగునివ్వాలి. ఆహారాంశాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి. ఆరోగ్య సూత్రాలకి అనుగుణంగా చికిత్సాదేశాలివ్వాలి.CDTel 305.5

    (సెనెంతు డె ఎవ్వంటిస్టు సంస్థల్లో ప్రగతిశీల ఆరోగ్య సంస్కరణ - 720, 725 చూడండి!CDTel 306.1