Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వంటగత్తె, ఓ వైద్యమిషనెరీ

    ఉత్తరం 100, 1901 445. వంట చెయ్యటానికి మంచి వంటగత్తెను లేదా వంటగాణ్ని నియమించండి. ఆహారాన్ని జీర్ణమండల ఆవయవాలకి భారం కలిగే రీతిగా తయారు చేస్తే దాన్ని పరిశోధించటం తప్పనిసరిగా చెయ్యాలి. ఆహారాన్ని ఆరోగ్యదాయకంగాను రుచికరంగాను తయారు చెయ్యవచ్చు.CDTel 309.1

    MS 93, 1901 CDTel 309.2

    446. ఆసుపత్రిలో పనిచేసే వంటగాడు మంచి ఆరోగ్యసంస్కర్త అయి ఉండాలి. ఓ వ్యక్తి అభిరుచి ఆహారం అతడు నమ్మే విశ్వాసానికి అనుగుణంగా లేకపోతే అతడు మారు మనసు పొందిన వ్యక్తికాడు.CDTel 309.3

    ఆసుపత్రిలో పనిచేసే వంటగాడు సుశిక్షితుడైన వైద్యమిషనెరీ అవ్వాలి. అతడు సమర్ధతగల వ్యక్తి అయి ఉండాలి. తనకై తాను ప్రయోగాలు చేసుకునే సమర్థత అతడి కుండాలి. అతడు రెసిపీలకు పరిమితమయ్యే వ్యక్తి కాకూడదు. ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. అనారోగ్యదాయకమైన రెసిపీలని అనుసరించటం ద్వారా మనం మనకి హాని చేసుకో కూడదని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు.CDTel 309.4

    ప్రతీ ఆసుపత్రిలోను ఆహారం తమకు పడటం లేదని ఫిర్యాదు చేసేవారు కొందరుంటారు. అనారోగ్యకరమైన ఆహారం వల్ల కలిగే హానిని గురించి వారిని చైతన్య పర్చటం అవసరం. కడుపు శ్రమ పడుతుంటే మెదడు స్పష్టంగా ఉండటం ఎలా సాధ్యపడుతుంది?CDTel 309.5

    ఉత్తరం 37, 1901 CDTel 309.6

    447. మన ఆసుపత్రిలోని వంటపనివాడు పనిని పూర్తిగా అవగాహన చేసుకున్నవాడు, స్వస్త బుద్ధిగలవాడు, పరిశోధన చెయ్యగలవాడు, ఉపయోగించ కూడని పదార్ధాల్ని ఆహారం తయారు చెయ్యటంలో ఉపయోగించనివాడు అయి ఉండాలి.CDTel 309.7

    ఉత్తరం 331, 1904 CDTel 309.8

    448. రోగులు తాము తినటానికి అలవాటు పడ్డ ఆహారం మీద ఎంతో మెరుగైందిగా తప్పక గుర్తిచగల వంటకాలు తయారు చెయ్యగల వంటగాడున్నాడా? ఆసుపత్రిలో వంటచేసే వ్యక్తి ఆరోగ్యవంతమైన, రుచిగల ఆహారపదార్ధాల్ని కలగలుపు చెయ్యగల సామర్థ్యం కలిగి ఉండాలి. ఈ కలగలుపులు మీరూ నేనూ తినే ఆహారం కన్నా ఒకింత కమ్మగా ఉండితీరాలి.CDTel 309.9

    MS 88, 1901 CDTel 310.1

    449. వంటవాడిగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తిది చాలా బాధ్యత గల స్థానం. అతడు పొదుపు చేసే అలవాటు గల వ్యక్తి ఆహారాన్ని వృధాపుచ్చకూడదన్న గుర్తింపు గల వ్యక్తి అయి ఉండాలి. “ఏమియు నష్టపడకుండునట్లు మిగిలిన... ముక్కలు పోగు” చెయ్యండి అని క్రీస్తు అన్నాడు. ఏ శాఖలో పని చేసేవారైనా ఈ ఉపదేశాన్ని ఆచరించటం మంచిది. అధ్యాపకులు పొదుపు పాటించటం నేర్చుకుని దాన్ని ఉచ్చరణ ఆచరణల ద్వారా సహాయకులకి నేర్పించాలి.CDTel 310.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents