Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అర్థరాత్రి కేక కోసం సిద్దపడకపోటం

    (1867) | T.486,487283 CDTel 23.2

    35. ఆరోగ్య సంస్కరణ మూడోదూత వర్తమానంలో ఒక భాగమని శరీరంతో భుజమూ, చెయ్యీ ఎలా అనుసంధానమై ఉన్నాయో అలాగే మూడోదూత వర్తమానంతో ఆరోగ్య సంస్కరణ అనుసంధానపడి ఉన్నదని నాకు దర్శనంలో చూపించబడింది. ఘనమైన ఈ సేవలో ఓ ప్రజగా మనం పురోగమించాల్సివున్నాం. బోధకులు ప్రజలు కలసి కార్యాచరణ చేపట్టాలి. మూడోదూత వర్తమానం ఇచ్చే అర్థరాత్రి కేకకు దేవుని ప్రజలు సిద్ధంగా లేరు. తాము చేయాల్సిన పని వారికున్నది. దాన్ని చేయటానికి వారు దేవునికి విడిచి పెట్టకూడదు. ఆయన ఆ పనిని వారికి విడిచి పెట్టాడు. అది వ్యక్తిగతమైన పని. ఒకరు ఇంకొకరికోసం దాన్ని చెయ్యలేరు. “ప్రియులారా! మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, శరీరమునకును, ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి మనలను పవిత్రులునుగా చేసికొందము.” భోజన ప్రీతి ఈ యుగంలో ప్రబలుతున్న పాపం. అమిత భోజన ప్రీతి స్త్రీలను, పురుషులను బానిసలుగా మార్చి వారి మానసిక శక్తుల్ని మసకమార్చి, వారి నైతిక శక్తుల్ని స్తంభింపజేస్తుంది. అందువలన వారు దైవ వాక్యంలోని పవిత్రమైన, సమున్నతమైన సత్యాల్ని అభినందించలేరు. స్త్రీలు పురుషులు తుచ్ఛ ప్రవృత్తుల అదుపులో నివసిస్తున్నారు.CDTel 23.3

    పరలోక ఆరోహణానికి సిద్ధపాటుకి దైవ ప్రజలు తమ గురించి తాము తెలుసుకోటం అవసరం. “నీవు నన్ను కలుగ జేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి” అంటూ కీర్తనకారుడితో గొంతు కలిపేందుకు గాను తమ దేహనిర్మితిని గురించి వారు అవగాహన కలిగి ఉండాలి. నైతిక, మానసిక ఇంద్రియాలు వారి భోజన ప్రియత్వాన్ని అదుపులో ఉంచాలి. శరీరం మనసుకు సేవ చెయ్యాలి కాని మనసు శరీరానికి కాదు.CDTel 23.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents