Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    క్షీణింపజేసే ఆహారం ఆరోగ్య సంస్కరణకు అపకీర్తి తెస్తుంది.

    ఉత్తరం 135,1902 CDTel 88.1

    139. మన ప్రజల్లో కొందరు అనుచిత ఆహారాన్ని ముట్టరు. కానీ శరీర పోషణకు అగత్యమైన పదార్థాలు గల ఆహారం తినటం నిర్లక్ష్యం చేస్తారు. మనం విసర్జిస్తున్న ఆహారంలోని హానికరమయిన పదార్థాల బదులు ఆరోగ్యకరం రుచికరం అయిన ఆహారం తినటంలో విఫలమవ్వటం ద్వారా ఆరోగ్యసంస్కరణకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకకుందుముగాక! అనేక కుటుంబాలు ఎక్కువగా ఉపయోగిస్తున్న ఆహారం బదులు పోషణనిచ్చే ఆహారాన్ని తయారు చేయటంలో ఎంతో నేర్పు, వివేకం అవసరమౌతాయి. ఈ కృషికి దేవుని పై విశ్వాసం, కార్యదీక్ష, పరస్పర సహకారానికి సంసిద్ధత కావాలి. బలవర్థక ఆహార పదార్థాలు లోపించిన ఆహారం ఆరోగ్య సంస్కరణ కృషికి అపఖ్యాతి తెస్తుంది. మనం మనుషులం. శరీరానికి సరిఅయిన పోషణనిచ్చే ఆహారాన్నే మనం తినాలి.CDTel 88.2

    [శక్తి హీనత కలిగించే ఆహారం సిఫారసు చెయ్యను-315,317,318,388] CDTel 88.3

    [శక్తి హీనత కలిగించే ఆహారం తీవ్రభావాల ఫలితం-316]CDTel 88.4

    [మాంసాహారాన్ని విడిచి పెట్టేటప్పుడు శక్తి హీనత కలిగించే ఆహారం తినకుండా జాగ్రత్తపడాలి-320,816]CDTel 88.5

    [శక్తి హీనత కలిగించే ఆహారం ఆధ్యాత్మికానుభావానికి తోడ్పడదు-323]CDTel 88.6

    [సామాన్య, పౌష్టిక ఆహారం లేనందువల్ల నశిస్తున్న కుటుంబసభ్యుల సాదృశ్యం -329]CDTel 88.7

    (C.T.B.H.58) (1890) C.H.155,156 CDTel 88.8

    140. మీ ఆహారపు అలవాట్లను పరిశీలించండి. కార్యకారణాల్ని అధ్యయనం చేయండి. కానీ ఆరోగ్యసంస్కరణకు వ్యతిరేకంగా పనిచేసే మార్గాన్ని అజ్ఞానంగా అనుసరించటం ద్వారా సంస్కరణను గూర్చి అబద్ధసాక్ష్యం పలకకండి. మీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయటం ద్వారా లేక దుర్వినియోగం చెయ్యటం ద్వారా మీరు దేవునికి చేయబద్ధులై ఉన్న సేవను అనర్హం చెయ్యకండి. నాకు ఇది ఖచ్చితంగా తెలుసు, మన సేవలో ఎంతో ఉపయోగకరమైన పనివారు కొందరు అలాంటి అలక్ష్యం వల్ల మరణిస్తున్నారు. రుచికరమైన, బలవర్థకమైన ఆహారాన్ని సరఫరా చెయ్యటం ద్వారా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడటం గృహయజమానుడి ప్రథమ కర్తవ్యం. ఆహారానికి అవసరమైన పదార్థాల్ని సమకూర్చకుండా ఉండేకన్నా తక్కువ ఖరీదైన బట్టలు, సామాగ్రి కొనుగోలు చేసుకోటం మేలు.CDTel 88.9