Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    భాగం III - వంట పాఠశాలలు అతి ముఖ్యమైన సేవ

    (1902) 7T 55 CDTel 492.1

    804. మన పెద్ద నగరాల్లో వైద్య మిషనెరీ సేవ జరిగే స్థలాల్లో వంట పాఠశాలలు నిర్వహించాలి. విద్యామిషనెరీ సేవ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆరోగ్య భోజన హోటళ్లని స్థాపించాలి. ఆరోగ్య ఆహార పదార్ధాల ఎంపిక, ఆరోగ్యకర ఆహారం తయారు చెయ్యటం గురించి వాటిలో ఆచరణాత్మకమైన ఉదాహరణ నివ్వాలి.CDTel 492.2

    (1909) 9T 112 CDTel 492.3

    805. వంట పాఠశాలల్ని నిర్వహించాలి. ఆరోగ్యకరమైన ఆహారం ఎలా తయారు చెయ్యాలో ప్రజలకు నేర్పించాలి. అనారోగ్యకరమైన ఆహార పదార్థాల్ని నిరాకరించాల్సిన అవసరాన్ని వారికి చూపించాలి. కాని మనం ఎన్నడూ నిరాహారాన్ని ప్రబోధించకూడదు. టీ, కాఫీ, మాంస పదార్థాలు ఉపయోగించకుండా ఆరోగ్యకరమైన, బలవర్ధకమైన ఆహారం తయారు చేసుకోటం సుసాధ్యం. ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం తయారు చేసుకోటమెలాగో ప్రజలకు ఉపదేశించే సేవ మిక్కిలి ప్రాముఖ్యమైంది.CDTel 492.4

    (1902) 7T 126 CDTel 492.5

    806. కొందరు శాఖాహారాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత తిరిగి మాంసాహారానికి వెళ్తారు. ఇది బుద్ది హీనత. మాంసం స్థానంలో సరియైన ఆహారాన్ని ఎలా తయారు చెయ్యాలో వారికి తెలియదని ఇది వెల్లడి చేస్తుంది.CDTel 492.6

    జ్ఞాన వివేకాలు గల ఉపదేశకులు నడిపించే వంట పాఠశాలలు అమెరికాలోను, ఇతర దేశాల్లోను జరపాలి. సంస్కరణాహారం విలువను ప్రజలకు చూపించటానికి చెయ్యగల సమస్తాన్ని చెయ్యాలి.CDTel 492.7

    (1905) M.H.320,321 CDTel 492.8

    807. ఆహార సంస్కరణ ప్రగతి శీలం కావాలి. జంతువుల్లో వ్యాధి పెరిగే కొద్దీ పాలు, గుడ్ల వాడకం క్షేమం కాదు. వాటి స్థానాన్ని భర్తీ చెయ్యటానికి ఆరోగ్యకరమైన, చౌకైన ఆహార పదార్థాల్ని సరఫరా చెయ్యటానికి గట్టి ప్రయత్నం జరగాలి. సాధ్యమైనంత వరకు అన్నిచోట్ల పాలు, గుడ్లు వాడకుండా ఆరోగ్యకరమైన కమ్మని ఆహారం ఎలా తయారు చెయ్యాలో ప్రజలకు నేర్పించాలి.CDTel 492.9

    (1890) C.T.B.H.119 CDTel 493.1

    808. సరిగా నడిపించే ఆరోగ్య వంట పాఠశాలలిచ్చే జ్ఞానాన్ని ఉపయోగించగలిగే వారు అది తమ వ్యావహారిక జీవితంలోను ఇతరులకు బోధించటం లోను గొప్ప మేలు చేస్తుందని గుర్తిస్తారు.CDTel 493.2