Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    బోధకుల ప్రత్యేక బాధ్యతలు - వారు ఎదుర్కొనే శోధనలు

    అందరి పై ముఖ్యంగా సత్యాన్ని బోధించే సువార్త బోధకుల పై తిండి వాంఛలను అధిగమించాల్సిన గంభీర బాధ్యత ఉంది. వారికి తమ ఆహార వాంఛమీద ఉద్రేకాలమీద నియంత్రణ ఉంటే వారి ప్రయోజకత్వం మరింత ఎక్కువగా ఉంటుంది. వారు తమ శరీరక శ్రమను మానసిక శ్రమతో సంయుక్తం చేస్తే వారి మానసిక నైతిక శక్తులు మరింత నిర్మలంగా ఉంచుకోగలుగుతారు. వారు ఆమార్గాన్ని అనుసరిస్తే వారి తలంపులు మాటలు సరళంగా సాఫీగా వెలువడతాయి. వారి ఆధ్యాత్మిక కార్యకలాపాలు మరింత శక్తిమంతమవుతాయి. వారి బోధలు వినేవారు మరింత ప్రభావితమవుతారు.CDTel 49.1

    మితంలేని తిండి సరియైన ఆహారమైనా, దేహ వ్యవస్తకు విఘాతం కలిగించి సున్నితమైన పరిశుద్ధమైన భావోద్రేకాన్ని మొద్దుబార్చుతుంది.CDTel 49.2

    అ డేటెడ్ MS 88 CDTel 49.3

    74. కొందరు వ్యక్తులు శిబిర సమావేశాలు జరిగే స్లలానికి ఆ సమయాలకు సమంజసం కాని ఆహారాన్ని - కేకులు, పైలు, రకరకాల వంటకాలు తెస్తారు. అవి ఆరోగ్యవంతుడైన కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి జీర్ణక్రియను అస్తవ్యస్తం చేస్తాయి. ఇకపోతే ఉత్తమమైనవే బోధకుడికి ఇవ్వటానికి ఏమంత చెప్పుకోతగ్గవి కాదు. ప్రజలు వీటిని అతడి భోజనబల్ల మీద పెడ్తారు. అతణ్ని తమతో భోంచెయ్యటానికి ఆహ్వానిస్తారు. ఈ రకంగా భోధకులు మితిమీరి తినటానికి ఆరోగ్యానికి హానిచేసే ఆహారం తినటానికి శోధించబడతారు. శిబిర సమావేశాలు సదస్సుల్లో వారి సామర్థ్యం తగ్గటమే కాదు అనేకులు అజీర్తి వ్యాధికి గురౌతారు.CDTel 49.4

    అమర్యాదగా ఉన్నట్లు కనిపించే ప్రమాదమున్నప్పటికీ, సహృదయంతో వారిచ్చిన అవివేక ఆతిథ్యానికి ఆహ్వానాన్ని బోధకులు తిరస్కరించాలి. ప్రజలకి నిజమైన దయ ఉండాలి. అలాంటి ఆహారం తినటానికి అతడ్ని ఒత్తిడి చేయకూడదు. అనారోగ్యకరమైన ఆహారం తినటానికి బోధకుడ్ని శోధించటం ద్వారా వారు పాపం చేస్తారు. ఆ విధంగా విలువైన ప్రతిభను దైవ సేవ పోగొట్టుకుంటుంది. అనేకులు తాము జీవించివున్నకాలంలో సగం శారీరక బలాన్ని మానసిక శక్తుల్ని కోల్పోతారు. అందరికన్నా ఎక్కువగా బోధకులు తమ మేథాశక్తిని, మెదడు నరాల శక్తిని పొదుపుగా వాడుకోవాలి. ఉద్రేకం ఉద్వేగం వెంట విచారం దుఃఖంతో కూడిన మానసిక స్థితి వస్తుంది. మితం లేని తిండి మనసును మసకబార్చుతుంది. ఆలోచించటం కష్టమౌతుంది. తికమకపడటం జరుగుతుంది. ఆహారపు అలవాట్ల విషయంలో ఖచ్చితమైన మితాన్ని పాటించే వరకు ఎవరూ జయప్రదమైన ఆధ్యాత్మిక పరిచారకులు కాలేరు. ఆరోగ్యంగా నివసించటానికి ఎలా తినాలో తెలిసి కూడా మనసును శరీరాన్ని బలహీన పర్చే మారాన్ని అవలంబించే వారి పై దేవుడు తన పరిశుద్ధాత్మతను ఉంచలేడు.CDTel 49.5