Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పోషకాలు లేని ఆహారం తినకండి

    - (1870) 2T 366, 367CDTel 201.3

    317. పోషకపదార్థాలు లేని ఆహారం సంగతి ఏమిటి? ఆహారం వాసి రాశి ఆరోగ్య చట్టాలకు ఖచ్చితంగా లోబడి ఉండటం ప్రాముఖ్యమని నేను చెప్పాను. కాని నిస్సారమైన ఆహారాన్ని మేము సిఫారసు చేయ్యం, అనేకమంది ఆరోగ్య సంస్కరణను తప్పుగా అర్థం చేసుకుని పోషక పదార్థాలు లేని ఆహారం తీసుకుంటున్నట్లు నేను దర్శనంలో చూశాను. వారు శరీర పోషణతో సంబంధం లేకుండా తయారు చేసిన, చౌకగా దోరికే, పోషక పదార్థాలు లోపించిన ఆహారం తిని నివసిస్తున్నన్నారు. వక్రం కాని ఆకలి తృప్తి పొందేందుకు ఆహారాన్ని జాగ్రత్తగా తయారు చెయ్యటం ప్రాముఖ్యం. మాంసం, బటర్, మిన్స్ పైలు, మసాలాలు, కొవ్వు, కడుపులో మంట పుట్టించి ఆరోగ్యాన్ని నాశనం చేసే పదార్థాల్ని విసర్జిస్తాం గనుక, మనం తినే ఆహారం ఏమంత ప్రాముఖ్యమైన విషయం కాదన్న అభిప్రాయం కలిగించ కూడదు.CDTel 201.4

    తీవ్ర ధోరణులు కలవారు కొందరున్నారు. వారు ఫలానా పరిమాణంలో ఫలానా నాణ్యతగల భోజనం చెయ్యాలి. రోజుకి రెండు లేదా మూడు పూటల భోజనానికి పరిమితమై ఉండాలి. వారు తినటానికి లేదా వారి కుటుంబాలు తినటానికి కొన్ని ఆహారపదార్థాల్ని మాత్రమే వారు అనుమతిస్తారు. కొంచెమే ఆహారం అదికూడా నాణ్యతలేని ఆహారం తినటంలో వారు తమ శరీరానికి సరిఅయిన పోషణనిచ్చే ఆహారాన్ని తీసుకోరు. బలం లేని ఆహారం మంచి రక్తంగా పరివర్తన చెందదు. నాసిరకం ఆహారం నాసిరకం రక్తాన్ని తయారు చేస్తుంది.CDTel 202.1

    [C.T.B.H.49,50] (1890) C.H.118 CDTel 202.2

    318. వర్ష రుచిని తృప్తిపర్చుకోటానికి తినటం తప్పుకాబట్టి ఆహారం విషయంలో మనం ఉదాసీనంగా ఉండకూడదన్నది స్పష్టం. అది ఎంతో ప్రాధాన్యం గల విషయం. ఎవరూ నిస్సార ఆహారం తీసుకోకూడదు. అనేకులు వ్యాధి వలన దుర్బలులై ఉన్నారు. వారికి చక్కగా వండిన పౌష్టికాహారం అవసరం. అందరికన్నా ఎక్కువగా ఆరోగ్యసంస్కర్తలు అతివాద వైఖరులు విడనాడాలి. శరీరానికి అవసరమైనంత పౌష్టికాహారం సరఫరా అవ్వా లి.CDTel 202.3

    MS 59, 1912CDTel 202.4

    319. ప్రియమైన సోదరుడు, CDTel 202.5

    గతంలో నీవు ఆరోగ్య సంస్కరణను ఎంతో పట్టుదలతో ఆచరించి మేలు పొందావు. ఒకసారి నీవు చాలా జబ్బుగా ఉన్నప్పుడు నీ ప్రాణం కాపాడటానికి ప్రభువు నాకో వర్తమానం ఇచ్చాడు. నీ ఆహారాన్ని కొన్ని ఆహారపదార్థాలకే పరిమితం చెయ్యటంలో నీవు కఠినంగా ఉన్నావు. నీకోసం ప్రార్థించేటప్పుడు నిన్ను సరి అయిన మార్గంలో పెట్టటానికి దేవుడు నాకు మాటల నిచ్చాడు. నీవు ఇంకా ఎక్కువ ఆహారం తీసుకోటం అవసరమన్న వర్తమానం వచ్చింది. మాంసాహారం వద్దని హితవు వచ్చింది. నీవు తీసుకోవలసిన ఆహారం విషయంలో దేవుడు సూచనలిచ్చాడు. ఆ సూచనల్ని పాటించి నివసించావు గనుక నీవింకా మా మధ్య ఉన్నావు.CDTel 202.6

    అప్పుడు నీకు వచ్చిన ఉపదేశం గురించి నేను తరచుగా తలస్తుంటాను. వ్యాధి బాధలకు గురి అయినవారికి అందించటానికి అనేక ప్రశస్త వర్తమానాలు దేవుడు నాకు ఇచ్చాడు. ఇందుకు నేను ప్రభువుకి కృతజ్ఞతరాలిని. ఆయనకు స్తుతి అర్పిస్తాను.CDTel 203.1