Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    తాత్కాలిక పండ్ల ఆహారం

    (1905) M.H.235 CDTel 321.2

    473. నిగ్రహం లేని తిండి తరచు వ్యాధికి కారణమౌతుంది. ప్రకృతి మీదపడే అనవసర భారాన్ని నివారించటమే అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్య. పెక్కు అస్వస్తతల సందర్భంగా, అధిక శ్రమకు గురి అయిన జీర్ణమండల అవయవాలకి విశ్రాంతి అవకాశం లభించేందుకు రోగి ఒకటి రెండు పూటలు ఉపవాసం చేయటం స్వస్తత కూర్చుతుంది. మెదడు పనివారికి పండ్ల ఆహారం తరచు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. స్వల్పకాలం ఆహారం పూర్తిగా మాని, ఆ తర్వాత సామాన్యమైన ఆహారం మితంగా భుజించటం అనేకసార్లు ప్రకృతి సొంత పునరుద్ధరణ కృషి ద్వారా స్వస్తతకు దారి తీస్తుంది. ఒకటి రెండు మాసాలు మితాహారం, ఆత్మత్యాగమే ఆరోగ్యానికి మార్గమని అనేకమంద బాధితులుకి నమ్మకం పుట్టిస్తుంది.CDTel 321.3