Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆహారంలో మార్పులు నెమ్మదిగా చెయ్యండి

    ఉత్తరం 331, 1904 CDTel 293.3

    426. రాత్రి సమయంలో నేను మీ ఇద్దరితో మాట్లాడుతున్నాను. ఆహార సమస్య గురించి మీతో చెప్పటానికి నాకు కొన్ని విషయాలున్నాయి. ఆసుపత్రికి వచ్చే లౌకికులుకి ఇచ్చే ఆహారం విషయంలో మీతో మాట్లాడూ మీ అభిప్రాయాలు మారాలని మీతో చెప్పాను. ఈ మనుషులు కొవ్వు పదార్ధాలున్న ఆహారం తింటూ అనుచితంగా నివసిస్తున్నారు. ఫలితంగా వారు విచ్చలవిడి తిండి పర్యవసానాల్ని అనుభవిస్తున్నారు. వారి ఆహారపానాల్లో సంస్కరణ అవసరం. అయితే ఈ సంస్కరణని అర్ధాంతరంగా అమలు పర్చకూడదు. దిద్దుబాటు క్రమక్రమంగా జరగాలి. వారి ముందు పెట్టే ఆరోగ్యాహారపదార్థాలు రుచిగా ఉండాలి. వారు బహుశా తమ జీవితమంతా మూడుపూటల భోజనానికి అలవాటు పడి ఉండవచ్చు. విలాసవంతమైన ఆహారం తింటుండవచ్చు. ఆరోగ్య సంస్కరణ సత్యాలతో ఈ ప్రజల్ని చేరటం ప్రాముఖ్యమైన విషయం. అయితే సరియైన ఆహారం తీసుకోటానికి వారిని నడిపించటానికి మీరు ఆరోగ్యకరమైన, రుచిగల ఆహారం వారి ముందు సమృద్ధిగా ఉంచాలి. వారు ఆరోగ్య సంస్కరణను స్వీకరించే బదులు దానినుంచి వైదొలగ కుండేందుకు మార్పులు అకస్మాత్తుగా చెయ్యకూడదు. వారికిచ్చే ఆహారాన్ని చక్కగా తయారు చెయ్యాలి. దాన్ని మీరూ నేనూ తినే ఆహారం కన్నా విలాసవంతంగా తయారుచెయ్యాలి......CDTel 293.4

    ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ వారిని కలవటానికి అనగా వారున్న చీకటిలో వారి స్వార్ధాశలతో వారిని కలవటానికి మీకు నేర్పు అవసరమని ప్రభువు చెబుతున్నాడని గ్రహించి నేను మీకు రాస్తున్నాను. వ్యక్తిగతంగా నాకు సంబంధించినంతవరకు నేను సామాన్యమైన, సరళమైన ఆహారాన్ని ఎంపికచేసుకుంటున్నాను. కాని లౌకికులు, స్వార్థాశలు గలవారు అయిన రోగుల్ని ఆరోగ్య సంస్కరణ నుంచి తొలగిపోయేంత కఠిన ఆహారం పై పెట్టటం మంచిది కాదు. తమ ఆహార పానాల అలవాట్లలో మార్పు అవసరమన్న నమ్మకాన్ని ఇది వారిలో పుట్టించదు. వారికి వాస్తవాలు చెప్పండి. సామాన్యం సరళం అయిన ఆహారం అవసరాన్ని గుర్తించేటట్లు వారికి ఉపదేశమివ్వాలి. మార్పును నెమ్మదిగా క్రమక్రమంగా తీసుకురండి. మీరు చేసేచికిత్సకు మీరిచ్చే ఉపదేశానికి స్పందించటానికి వారికి సమయమివ్వండి. పనిచేస్తూ, ప్రార్థిస్తూ సాధ్యమైనంత మృదువుగా వారిని నడిపించండి.CDTel 294.1

    ఒకసారి --- లోని ఆసుపత్రి అక్కడి రోగులతో పరిచయం చేసుకునేందుకు వారితో కలిసి భోజనం. చెయ్యటానికి నన్ను ఆహ్వానించింది. అప్పుడు ఆహారం తయారు చెయ్యటంలో గొప్ప తప్పు చెయ్యటం చూశాను. దాని రుచిపోయే రీతిగా దాన్ని కలిపారు. అది మూడింట రెండు వంతులకు మించలేదు. దానితో నాకు సరిపోయే భోజనం తయారు చెయ్యటం సాధ్యపడదని గుర్తించి పరిస్థితుల్లో మార్పు తేవటానికి ప్రయత్నించాను. సమస్య పరిష్కారమయ్యింది.CDTel 294.2