Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అనుకూల, ప్రతికూల తీవ్ర ధోరణులు విడిచిపెట్టండి

    (1872) 67 373,374 CDTel 219.1

    332. మన సహోదరుల్లో అనేకమంది ఆత్మల్లోను ఆచరణలోను ఆరోగ్య సంస్కరణకు వ్యతిరేకులని నాకు తెలుసు. నేను తీవ్ర ధోరణిని ప్రబోధించను. కాని నా రాతప్రతుల్ని తిరగేస్తున్న తరుణంలో స్వార్థాశలు, తిండి వాంఛ తృప్తి, బట్టల డంబం విషయాల్లో లోకాచారాలు అభ్యాసాల్ని అనుకరించటంలో మన ప్రజలకు వచ్చే ముప్పును గురించి దేవుడు పంపిన సాక్ష్యాల్ని హెచ్చరికల్ని చూశాను. ప్రస్తుత పరిస్థితుల్ని చూసినప్పుడు నా హృదయం దుఃఖంతో నిండుతుంది. మన సహోదరుల్లో కొందరు ఈ విషయాల్ని చాలా కఠినంగా అమలుపర్చారని కొందరంటున్నారు. కాని కొందరు అన్ని సందర్భాల్లోనూ ఆరోగ్య సంస్కరణను గూర్చి తమ అభిప్రాయాల్ని బలంగా చాటటంలో పొరపాటు చేశారు. కనుక ఈ అంశం పై సత్యాన్ని ఎవరైన దాచటానికి సాహసించగలరా? తినటం తాగటంలో లోకప్రజలు సాధారంణంగా హద్దు ఆపు లేకుండా, ఆశానిగ్రహం లేకుండా అతిగా వ్యవహరిస్తారు. ఫలితంగా దురాశలు వాంఛలు పెచ్చరిల్లుతాయి.CDTel 219.2

    ప్రభువు సేవ చెయ్యటానికి సిద్ధపడిన, కాని ఆరోగ్య చట్టాలకు విధేయంగా నివసించటం తమ పవిత్రవిధి అని గుర్తించని, అనేకులు ఇప్పుడు మరణం నీడలో నివసిస్తున్నారు. శరీరానికి సంబంధించిన చట్టాలు వాస్తవంలో దేవుని చట్టాలు. ఈ నిజాన్ని మనుషులు మరచిపోతున్నారు. కొందరు తమను ఆరోగ్యంగా ఉంచలేని ఆహారానికి తమని తాము పరిమితం చేసుకుంటున్నారు. హానికరమైన ఆహారపదార్ధాల్ని విడిచి పెట్టి వాటి స్థానంలో పోషకాలున్న ఆహారాన్ని తీసుకోటం లేదు. ఆహారాన్ని మిక్కిలి ఆరోగ్యవంతంగా తయారు చెయ్యటానికి నేర్పు విజ్ఞత ఉపయోగించటం అవసరమని వారు గుర్తించటం లేదు. దేహం దాని పనిని నిర్వహించటానికి శరీర వ్యవస్థకు సరియైన పోషకాహారం సరఫరా అవ్వాలి. అనారోగ్యదాయకమైన పలు రకాల వంటకాల్ని విసర్జించిన తర్వాత దానికి వ్యతిరేకమైన మితం హద్దును దాటి పరిమాణంలోను నాణ్యతలోను ఆహారం ప్రమాణాన్ని తగ్గించటం ఆరోగ్య సంస్కరణకు ప్రతికూలచర్య. ఇది ఆరోగ్య సంస్కరణ అయ్యేబదులు ఆరోగ్యవైకల్యం అవుతుంది.CDTel 219.3

    ఆరోగ్యకరమైన, రుచిగల ఆహారం తయారు చెయ్యటంలో ఉపదేశం ప్రాముఖ్యం- XXV విభాగంలో వంట పాఠశాలలు చూడండి.)CDTel 220.1