Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    రక్షకుని పద్ధతుల్ని అనుసరించండి

    (1905) M. H. 143, 144 CDTel 479.4

    791. ప్రజల్ని చేరటంలో క్రీస్తు పద్ధతులు మాత్రమే విజయం చేకూర్చుతాయి. తమ మేలు కోరే వ్యక్తిగా రక్షకుడు ప్రజలతో కలిసి ఉండేవాడు. వారి పట్ల సానుభూతి కనపర్చేవాడు, వారి అవసరాల్లో సేవ చేసేవాడు. అలా వారి విశ్వాసాన్ని పొందేవాడు. అప్పుడు “నన్ను వెంబడించుడి” అని ఆదేశించేవాడు.CDTel 479.5

    వ్యక్తిగత కృషి ద్వారా ప్రజలకు చేరువవ్వాల్సిన అవసరం ఉంది. ప్రసంగించటంలో తక్కువ వ్యక్తిగత సేవలో ఎక్కువ సమయం గడిపితే మరెక్కువ ఫలితాలు లభిస్తాయి. పేదలకు సహాయం చెయ్యాలి, వ్యాధిగ్రస్తులికి వైద్య సేవ చెయ్యాలి, దుఃఖంలో ఉన్నవారిని ఆప్తుల్ని కోల్పోయిన వారిని ఓదార్చాలి, అజ్ఞానులకు ఉపదేశం ఇవ్వాలి, అనుభవం లేనివారికి సలహాలివ్వాలి. దుఃఖించే వారితో మనం దు:ఖించాలి. సంతోషించేవారితో సంతోషించాలి. సమ్మతింపజేసే శక్తి, ప్రార్థన శక్తి, దైవ ప్రేమాశక్తి దన్నుగల ఈ సేవ నిష్ఫల మవ్వదు.CDTel 479.6

    వైద్యమిషనెరీ సేవాలక్ష్యం లోకపాపాన్ని తీసివేసే కల్వరి ప్రభుని చూపించటమని మనం నిత్యం గుర్తుంచుకోవాలి. ఆయన వంక చూడటం ద్వారా మనుషులు ఆయన పోలికలోకి మార్పుచెందుతారు. వ్యాధి బాధితుల్ని యేసు వంక చూసి నివసించవలసిందని మనం ప్రోత్సహించాలి. ఎవరి శరీరాన్ని ఆత్మను వ్యాధి నిరుత్సాహపర్చుతుందో వారి ముందు సువార్త సేవకులు మహా వైద్యుడైన క్రీస్తును ఉంచాలి. శారీరక ఆధ్యాత్మిక వ్యాధులు రెండింటిని స్వస్తపర్చగల ఆయన వద్దకు ప్రజల్ని నడిపించండి. మన బలహీనతలయందు మనతో సహానుభవం ఉన్న ఆ ప్రభువును గూర్చి వారికి చెప్పండి. తమకు నిత్యజీవం సాధ్యపర్చేందుకోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆయన చేతులకు తమను సమర్పించుకోవలసిందిగా ప్రోత్సహించండి. ఆయన ప్రేమను గురించి ముచ్చటించండి. రక్షించటానికి ఆయనకున్న శక్తిని గురించి ప్రస్తావించండి.CDTel 480.1