Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆరోగ్య సూత్రాల ప్రాముఖ్యం

    (1909) 97 158-160 CDTel 12.3

    24. వర్తమానం తొలినాళ్ళలో ఇవ్వబడ్డ నియమాలు అప్పుడు ఎంత ప్రాముఖ్యమైనవో ఈ దినాల్లోనూ అంతే ప్రాముఖ్యంగల వాటిగా మనం పరిగణించాలని దేవుడు కోరుతున్నట్లు నేను దర్శనంలో చూశాను. ఆహారం పై వచ్చిన వెలుగును ఎన్నడూ అనుసరించనివారు కొందరన్నారు. వెలుగును కుంచం కిందనుంచి తీసి, స్పష్టమైన కాంతివంతమైన కిరణాలతో ప్రకాశింపజెయ్యాల్సిన సమయం ఇదే.CDTel 12.4

    వ్యక్తిగతంగానూ ఒక ప్రజలుగాను ఆరోగ్యజీవన సూత్రాలు మనకు ఎంతో విలువైనవి...CDTel 12.5

    ఇప్పుడు అందరూ పరీక్షకు నిలబడి ఉన్నారు. నిజనిరూపణ జరుగుతున్నది. మనం క్రీస్తులోకి బాప్తిస్మం పొందాం. మనల్ని అధోగతికి లాగి మనం ఎలా ఉండకూడదో అలా ఉంచే ప్రతీ అభ్యాసం నుంచి వేరవ్వటం ద్వారా మన పాత్ర పోషించటానికి సమ్మతంగా ఉంటే మన సజీవ శిరస్సు అయిన క్రీస్తులో పెరగటానికి మనకు శక్తి లభిస్తుంది. మనం దేవుని రక్షణను చూస్తాం.CDTel 12.6

    ఆరోగ్య జీవన సూత్రాల విషయంలో మనం వివేకంగా ఉన్నప్పుడే అపసవ్య ఆహారం షలితంగా కలిగే కీడును పూర్తిగా గుర్తించగలుగుతాం. తమ పొరపాట్లు గుర్తించి తమ అలవాట్లను మార్చుకునే ధైర్యంగలవారు సంస్కరణ ప్రక్రియకు నిరంతర శ్రమ పోరాటం అవసరమౌతాయని గ్రహిస్తారు. అయితే సరి అయిన రుచులు ఒకసారి ఏర్పడ్డప్పుడు, క్రితంలో తాము నిరపాయంగా భావించిన ఆహార పదార్థాలు అజీర్తి, తదితర వ్యాధులికి నెమ్మదిగా, ఖచ్చితంగా పునాది వేస్తున్నాయని గుర్తిస్తారు. CDTel 13.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents