Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    భాగం II - టీ, కాఫీ టీ, కాఫీల ఉత్తేజపర్చే ప్రభావాలు

    (R.& H. ఫిబ్ర 21,1888) CDTel 438.3

    732. నేటి ఆహారం, పానీయం ఉత్తేజం పుట్టించేవి. అవి ఆరోగ్యానికి సహాయపడేవి కావు. టీ, కాఫీ, పొగాకు ఉత్తేజకాలు. వాటిలో విషముంటుంది. అవి అనవసరమైనవే కావు, హానికరమైనవి కూడా. మితానుభవం పాటించాలంటే మనం వాటిని విడిచి పెట్టాలి.CDTel 438.4

    (1868) 2T 64,65 CDTel 438.5

    733. టీ శరీర వ్యవస్థని విషంతో నింపుతుంది. క్రైస్తవులు దాన్ని విడిచి పెట్టాలి. కాఫీ ప్రభావం కూడా టీ చూపే ప్రభావం లాంటిదే, కాని వ్యవస్థ పై దాని ప్రభావం మరింత ప్రమాదకరమైనది. అది ఉత్సాహ పర్చుతుంది. అది ఎంత ఎత్తుకు లేపుతుందో అంత తీవ్రతకు అలసటకు గురిచేసి, అధోగతికి చేర్చుతుంది. చర్మం పసుపురంగు ధరించి, నిర్జీవంగా కనిపిస్తుంది. ముఖంపై ఆరోగ్యం మెరుపు కనిపించదు.CDTel 438.6

    MS 22, 1885 CDTel 438.7

    734. టీ, కాఫీ, మత్తుమందు, నల్లమందు, పొగాకు మానవులకి అన్ని రకాల వ్యాధులు కలిగిస్తున్నాయి. ఈ హానికరమైన వ్యసనాల్ని విడిచి పెట్టాలి. వీటన్నిటిని విడిచి పెట్టాలి. అన్నీ హానికరమైనవే. ఇవి శారీరక, మానసిక, నైతిక శక్తుల్ని దెబ్బతీస్తాయి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని విడిచి పెట్టాలి.CDTel 438.8

    [మరణ విత్తనాలు విత్తటం-665]CDTel 438.9

    (R.& H. జూలై, 29.1884) CDTel 439.1

    735. టీ, కాఫీ, బియరు, మద్యం లేక సారా ముట్టవద్దు. కణాలని శుభ్రం చెయ్యటానికి నీరు శ్రేష్ఠమైన ద్రవం.CDTel 439.2

    (1890) C.T.B.H.34-36 CDTel 439.3

    736. టీ, కాఫీ, పొగాకు సారా సంబంధిత పానీయాలు వేర్వేరు పరిమాణాల్లోని కృత్రిమ ప్రేరేపకాలు.CDTel 439.4

    క్రితంలో చెప్పిన రీతిగా టీ, కాఫీ చూపే ప్రభావం మద్యం, సారా, పొగాకు ప్రభావం వంటిదే.....CDTel 439.5

    కాఫీ తాగటం హానికరమైన అలవాటు. అది మనసుని తాత్కాలికంగా ఉత్సాహపర్చుతుంది. కాని దాని తదుపరి పర్యవసానం అలసట, పడుకోటం, మానసిక, నైతిక, శారీరక శక్తుల స్తంభనం. మనసు దుర్బలమౌతుంది. ధృఢ సంకల్పంతో కృషి చేసి ఆ అలవాటుని జయిస్తే తప్ప మెదడు చురుకుతనం శాశ్వతంగా తగ్గుతుంది. నరాలని రెచ్చగొట్టే ఈ పదార్థాలన్నీ జీవశక్తుల్ని క్షీణింపజేస్తాయి. సంక్షోభం చెందిన నరాల వల్ల ఏర్పడే అశాంతి, అసహనం, మానసిక అశక్తత ఓ ప్రతిఘటన శక్తిగా మారి ఆధ్యాత్మిక ప్రగతిని వ్యతిరేకిస్తుంది. కనుక మితానుభవాన్ని, సంస్కరణని ప్రబోధించేవారు హానికరమైన ఈ పానీయాల వలన కలిగే కీడుల్ని ప్రతిఘటించటానికి మేలుకోవద్దా? కొన్ని సందర్భాల్లో టీ, కాఫీ అలవాటుని విడిచి పెట్టటం సారా బానిస సారా అలవాటుని విడిచి పెట్టటం అంత కష్టమౌతుంది. టీ, కాఫీలకి వ్యయం చేసే డబ్బు వృధా అవుతుంది. అవి వ్యక్తికి నిత్యం హాని చేస్తాయి. టీ, కాఫీ, నల్లమందు, సారా వాడేవారు కొన్నిసార్లు పెద్దవయసు వచ్చే వరకూ నివసించవచ్చు. కానీ ఇది ఈ ప్రేరేపకాల్ని ఉపయోగించటానికి అనుకూలమైన తర్కం కాదు. ఈ వ్యక్తులు ఏది సాధించగలిగి ఉండి తమ మితరహిత అలవాట్లు అభ్యాసాల మూలంగా సాధించలేకపోయారో దేవుని ఆ మహాదినం నాడే బయలు పడుంది. CDTel 439.6

    పనిచెయ్యటానికి ఉత్సాహం పొందటానికి టీ, కాఫీలు సేవించేవారు వణకుతున్న నరాలు, ఆత్మనిగ్రహం లేకపోటం రూపంలో దీని దుష్ఫలితాల్ని అనుభవిస్తారు. అలసిన నరాలకి విశ్రాంతి, ప్రశాంతత అగత్యం . అలసిపోయిన తన శక్తుల్ని పునరుద్ధరించుకోటానికి ప్రకృతికి సమయం అవసరం. అయితే ఉత్తేజకాల వినియోగం ద్వారా దాని శక్తుల్ని అంకుశంతో పొడవటం జరిగినప్పుడల్లా వాస్తవిక శక్తి క్షీణిస్తుంది. ఈ అస్వాభావిక ఉత్సాహం వల్ల కొంత కాలం ఎక్కువ సాధించటం జరగవచ్చు. కాని క్రమేపి అనుకున్న స్థాయికి శక్తుల్ని మేల్కొల్పటం కష్టమౌతుంది. కడకు అలసిపోయిన ప్రకృతి ఇక స్పందించలేకపోతుంది.CDTel 439.7