Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పరిశుద్దీకరణ అసాధ్యమైనవేళ

    హెల్త్ రిఫార్మర్, మార్చి, 1878 CDTel 36.3

    52. మానవ కుటుంబాన్ని పట్టిపీడించే దుర్బలతల్లో ఎక్కువ శాతం వారి దురభ్యాసాలవల్ల లేదా వారి ఇష్టపూర్వక అజ్ఞానంవల్ల లేదా వారి దేహానికి సంబంధించి దేవుడిచ్చిన వెలుగును అలక్ష్యం చేయటంవల్ల వచ్చేవి. జీవిత చట్టాలికి విరుద్ధంగా నడుచుకుంటూ దేవుణ్ని మహిపర్చటం సాధ్యంకాదు. చెడు తిండి పై మనసు మరులు పడ్డప్పుడు హృదయం దేవునికి అంకితమవ్వటం సాధ్యపడదు. హానికరమయిన దుర్వ్యసనాల్లో నిత్యం నిమగ్నమైనందువల్ల వ్యాధిగ్రస్తమయిన శరీరం, నిలకడ లేని మనసు శరీరాత్మల పరిశుద్ధీకరణకు అడ్డు బండలుగా నిలుస్తాయి. క్రైస్తవ ప్రవర్తన పరిపూర్ణతకు శరీరం ఆరోగ్యస్థితిలో ఉండటం ప్రాముఖ్యమని అపోస్తలుడు గ్రహించాడు. అతడంటుంన్నాడు, “ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.” అతడు ఆత్మఫలాల్ని ప్రస్తావిస్తూ వాటిలో ఆశాని గ్రహాన్ని పేర్కొంటున్నాడు. “క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను, దురాశలతోను సిలువ వేసియున్నారు”.CDTel 36.4

    [ఆహార వాంఛకు పాలనాధికారమిస్తూ, క్రైస్తవ పరిపూర్ణత సాధన అసాధ్యత -356] CDTel 37.1