Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    లభించిన దైవ సమ్మతి

    ఈ హెబ్రీయువకుల ధృఢమైన ఆత్మత్యాగాన్ని దేవుడు ఆనందంతో అంగీకరించాడు. ఆయన దీవెనలు వారిపై ఉన్నాయి. ఆయన “వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడైయుండెను.” మూడు సంవత్సరాల శిక్షణకాలం ముగిసిన తర్వాత వారి సామర్థ్యాలు సాధనల్ని రాజు పరీక్షించినప్పుడు ” దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారెవరును లేరుగనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వారియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధమైన ప్రతీ విషయములో వీరు తన రాజ్యమందంతట నుండు శకునగాండ్రకంటెను గారడీ విద్యగలవారి కంటెను పదియంతలు శ్రేష్ఠులని తెలియబడెను.”CDTel 22.2

    ఇక్కడ అందదరికీ, ముఖ్యంగా యువతకు ఒక పాఠం ఉంది. దేవుని నిబంధన నిష్కర్షగా ఆచరించటం శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. అత్యున్నత నైతిక, మానసిక ప్రమాణాన్ని సాధించటానికి దేవుని వద్దనుంచి జ్ఞాన వివేకాల్ని శక్తిని పొంది, జీవిత అలవాట్లన్నింటిలో ఖచ్చితమైన మితాన్ని పాటించటం అవసరం. దానియేలు అతడి సహచరుల అనుభవంలో భోజన ప్రీతికి కలిగే శోధన పై నియమం సాధించే విజయానికి మనకిదొక సాదృశ్యం. మత నియమం ద్వారా యువ కులు శరీరేచ్చల పై విజయం సాధించి, గొప్ప త్యాగం చేయవలసినప్పటికీ వారు దేవుని న్యాయవిధులను ఆచరించటంలో నమ్మకంగా ఉండగలుగుతారని ఇది సూచిస్తున్నది.CDTel 22.3

    ద్రానియేలు ఆహారం - 117,241,242]CDTel 23.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents