Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మానవ యంత్రాంగానికి అవరోధ కల్పన

    [C.T.B.H.51] (1890) C.H.119 CDTel 128.5

    211. ఆరోగ్యకరమైనా దాన్ని అతిగా తినటం జరగవచ్చు. ఓ వ్యక్తి హానికరమైన ఆహారపదార్థాల్ని ఉపయోగించటం లేదుకనుక తాను ఎంత తినాలనుకుంటే అంత తినవచ్చుననుకోకూడదు. ఆహార పరిమాణం ఎంత అయినా మితిమీరిన తిండి జీవయంత్రానికి అడ్డుపడి దాని పనికి ఆటంకం కలిగిస్తుంది.CDTel 128.6

    సయిన్స్, సెప్టెంబరు 1,1887 CDTel 129.1

    212. మితం పాటించని తిండి, ఆరోగ్యకరమైన ఆహారమైనా, దేహవ్యవస్త పై హానికరమైన ప్రభావం చూపించి, మానసిక, నైతిక శక్తుల్ని మొద్దుబార్చుతుంది.CDTel 129.2

    ఉత్తరం 73a, 1896 CDTel 129.3

    213. దాదాపు మానవ కుటుంబ సభ్యులందరూ శరీర వ్యవస్థకు అవసరమైన దానికన్నా ఎక్కువ తింటారు. అదనంగా ఉన్న ఆహారమంతా కుళ్ళి, మురిగిన ముద్దగా తయారవుతుంది. జీవ యంత్రాంగానికి అవసరమైన దానికన్నా ఎక్కువ ఆహారాన్ని అన్నకోశంలోకి తీసుకుంటే, ఎక్కువైన పదార్థం భారంగా పరిణమిస్తుంది. దాన్ని పరిష్కరించటానికి శరీరవ్యవస్థ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఈ అదనపు శ్రమ అలసట పుట్టిస్తుంది. నిత్యం తింటూ ఉండే కొందరు దీన్ని ఆకలి అంటారు. కానీ ఇది జీర్ణావయవాలు అతిగా పనిచేసినందువల్ల ఏర్పడ్డ పరిస్థితి.CDTel 129.4

    [సామాన్యం, ఆరోగ్యదాయకం అయిన ఆహారాన్ని అతిగా తినటం వల్ల పర్యవసానాలు-33,137] CDTel 129.5

    (1900) 6T 343 CDTel 129.6

    214. అతిథులుకి ఆతిథ్యం ఇవ్వటంలో ప్రదర్శనకు అనవసర ఆందోళనలు, భారాలు సృష్టించుకోటం జరుగుతుంది. భోజనానికి రకరకాల వంటకాలు తయారు చెయ్యటంలో గృహిణి ఎక్కువ పని చేస్తుంది. గృహిణి కష్టపడి ఎన్నో వంటకాలు తయారు చెయ్యటంతో అతిథులు మితిమీరి తింటారు. ఒకపక్క నుంచి అధిక శ్రమవల్ల ఇంకో పక్కనుంచి మితిమీరిన తిండివల్ల వ్యాధి బాధ సంభవిస్తాయి. పెద్దఎత్తున చేసే ఈ విందులు భారమే కాదు హానికరం కూడా.CDTel 129.7

    హెల్త్ రిఫార్మర్, జూన్, 1878 CDTel 129.8

    215. తిండిబోతు విందులు, అసమయాల్లో అన్నకోశంలోకి తీసుకునే ఆహారం దాని ప్రభావాన్ని శరీర వ్యవస్థలోని ప్రతీ అణువుమీద పడుతుంది. మనం తినే తిండివల్ల మనం తాగే పానీయం వల్ల మన మనసు తీవ్రంగా ప్రభావితమౌతుంది.CDTel 129.9

    (1876) 4T 96 CDTel 130.1

    216. కఠిన శారీరక శ్రమ పెరుగుతున్న బిడ్డలకు హానికరం. అయితే కేవలం అధిక శ్రమవల్ల వందలాది జనం తమ శరీరతత్వాల్ని పాడుచేసుకుంటున్నట్లే. అతి తిండి, సోమరితనం వల్ల వేలాది జనం తమ శరీరతత్వాల్లో వ్యాధి విత్తనాల్ని విత్తి నాశనం దిశగా పరుగులు తీస్తున్నారు.CDTel 130.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents