Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    జీర్ణక్రియకు సాయపడే మిత వ్యాయామం

    సోదరుడా, నీ మెదడు మొద్దుబారింది. నీవు తినే పరిమాణంలో ఆహారం తినే వ్యక్తి శారీరక శ్రమ చేసే వ్యక్తి అయివుండాలి. వ్యాయామం జీర్ణక్రియకు, శరీరం మనసు ఆరోగ్య స్థితిలో ఉండేందుకు ప్రాముఖ్యం. నీకు వ్యాయామం అవసరం. నీవు చెక్కబొమ్మలా కదులుతున్నావు. పనిచేస్తున్నావు. నీకు ఆరోగ్యవంతమైన క్రియాత్మకమైన వ్యాయామం ఎంతో అవసరం. ఇది మనసుకు శక్తినిస్తుంది. కడుపునిండా ఆహారం తిన్న తర్వాత చదవకూడదు, వ్యాయామం చెయ్యకూడదు. ఇది శరీర వ్యవస్థ చట్టాల అతిక్రమణ ఔతుంది. భోజనమైన వెంటనే నరాల శక్తి పై బలమైన వాయు ప్రవాహం ఉంటుంది. అన్నకోశానికి సహాయం చెయ్యటానికి మెదడు శక్తి అవసరమౌతుంది. కనుక భోజనం అయిన వెంటనే మనసుగాని శరీరంగాని అతిగా పనిచెయ్యాల్సి వచ్చినపుడు, జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. ఒక దశలో జరగుతున్న పనికి అగత్యమయ్యే శరీర వ్యవస్థలోని జీవశక్తిని మళ్లించి ఇంకో దిశలోని పనికి పురమాయించటం జరుగుతుంది.CDTel 98.1

    (1890) C.T.B.H.101 CDTel 98.2

    158. వ్యాయామం అజీర్తి రోగికి సహాయం చేస్తుంది. అది జీర్ణమండల అవయవాలికి ఆరోగ్యవంతమైన స్థాయినిస్తుంది. భోజనం చేసిన వెంటనే తీవ్ర అధ్యయనంలో గాని వ్యాయామంలోగాని నిమగ్నమవ్వటం జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఎందుచేతనంటే జీర్ణక్రియను నిర్వహించటానికి అవసరమయ్యే వ్యవస్థ తాలూకు జీవశక్తి ఇతర భాగాల్లో పనికి నియుక్త మౌతుంది. అయితే భోజనం తర్వాత తల నిటారుగా ఉంచి, భుజాలు వెనక్కు విరిచి, మితంగా వ్యాయామం చెయ్యటం ఎంతో లాభదాయకం. మనసు వ్యక్తిగత ఆలోచనల నుంచి ప్రకృతి సొగసుల పైకి మళ్లుతుంది. గమనాన్ని అన్నకోశంపై ఎంత తక్కువ నిలిపితే అంత మంచిది. మీకు హానిచేసే ఆహారం గురించే నిత్యం భయపడూవుంటే, అది ఖచ్చితంగా హాని చేస్తుంది. మీ బాధలు శ్రమల్ని మర్చిపోండి. ఉత్సాహం పుట్టించే విషయాల గురించి ఆలోచించండి.CDTel 98.3

    [అమితంగా తినటం మెదడుకు ఎక్కువ రక్తాన్ని ప్రసరింపచేస్తుంది-276] CDTel 99.1

    [వ్యాయామం ముఖ్యంగా సోమరి స్వభావంగలవారికి అవసరం-225]CDTel 99.2

    [ఆలస్యంగా తిన్న రాత్రి భోజనం ఫలితం నిద్రభంగం-270]CDTel 99.3

    [మూర్చపోతున్నట్లు అనిపించే ఆమనోభావనకు కారణం-213,218, 245,269,270,561,705,707]CDTel 99.4

    [అమిత తిండి జీర్ణమండల అవయవాల్ని దుర్బలపర్చి. జీర్ణంచేసుకునే శక్తిని దెబ్బతీస్తుంది-202] CDTel 99.5

    [కడుపుకి ప్రశాంత విశ్రాంతి అవసరం-207] CDTel 99.6

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents