Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అదుపులేని తిండి వల్ల విస్తరిస్తున్న భష్టత

    (1864) Sp. Gifts IV, 124 CDTel 57.1

    89. మానవ జాతి శారీరకంగా మానసికంగా నైతికంగా ఇంతగా భ్రష్టమవటం అనేకులకు విభ్రాంతి కలిగిస్తుంది. ఈ భ్రష్టతకు దైవ ధర్మశాస్త్ర, ఉల్లంఘన ఆరోగ్య చట్టాల అతిక్రమణే కారణమని వారు గ్రహించటం లేదు. దైవాజ్ఞల ఉల్లంఘన, వృద్ధిననుగ్రహించే ఆయన హస్తాన్ని తొలగిస్తున్నది.CDTel 57.2

    అమితమైన ఆహార పానాలు, తుచ్ఛమైన భావోద్రేకాల సంతృప్తి సున్నిత భావాల్ని మొద్దుబార్చినందువల్ల మనసు పరిశుద్ధ విషయాల్ని సామాన్య విషయాల స్థాయికి దిగజార్చచటం జరుగుతుంది.CDTel 57.3

    (1864) Sp. Gifts IV, 131 CDTel 57.4

    90. విపరీతమైన తిండికి బానిసలై తిండిబోతుతనానికి అలవాటు పడేవారు ఇంకా కొంత ముందుకు వెళ్ళి భ్రష్ట ఉద్రేకాల్ని తృప్తి పర్చుకొటం ద్వారా మితం లేకుండా తిని తాగటం ద్వారా ఉద్రేకభరితులవటం ద్వారా తమ్ము తాము నైతికంగా దిగజార్చుకుంటారు. వారు తమ తుచ్ఛ ఉద్రేకాలు ఉద్వేగాల అదుపుకింద విచ్చలవిడిగా వ్యవహరిస్తూ తమ ఆరోగ్యాన్ని ప్రతిభను చాలా మట్టుకు నాశనం చేసుకుంటారు. దురభ్యాసాలు వారి ఆలోచనా శక్తుల్ని చాలా మట్టుకు నాశనం చేస్తాయి.CDTel 57.5

    హెల్త్ రిఫార్మర్, అక్టోబర్, 1871 CDTel 58.1

    91. క్రమంలేని ఆహారపానాలు, అనుచిత వస్త్రధారణ మనసును హృదయాన్ని భ్రష్టపర్చి ఆత్మతాలూకు ఉదాత్త గుణాల్ని పాశవిక ఉద్రేకాలకు బానిసల్ని చేస్తాయి.CDTel 58.2

    R.& H., జనవరి 25, 1881 CDTel 58.3

    92. భక్తులమని చెప్పుకునే వారు శరీరారోగ్యన్ని అలక్ష్యం చేసి, అమితానుభవం పాపం కాదని, అది తమ ఆధ్యాత్మికత కు హాని కలిగించదని గొప్పలు చెప్పకుందురు గాక. శారీరక మానసిక స్వభావాల మధ్య సానుభూతి ఉంటుంది. ప్రవర్తన ప్రమాణం శారీరక అలవాట్లను బట్టి సమున్నత మవ్వటమో తుచ్చమవ్వటమో జరుగుతుంది. ఉత్తమాహారాన్ని అతిగా తినటం నైతిక మనోభావాల పరంగా అనారోగ్య స్థితిని సృష్టిస్తుంది. కాగా ఆరోగ్యదాయకం కాని ఆహారం తింటే అది మరింత విఘాతం కలిగిస్తుంది. మానవ దేహ వ్యవస్తలో ఆరోగ్యదాయక చర్యకు దోహదపడని ఏ అలవాటైనా సమున్నతమైన ఉదాత్తమైన శక్తుల్ని భ్రష్టం చేస్తుంది. ఆహార పానాల విషయంలో చెడు అలవాట్లు తలంపుల్లోను క్రియల్లోనూ పొరపాట్లకు దారి తీస్తాయి. మితి మీరిన తిండి పాశవిక ప్రవృత్తుల్ని బలపర్చి వాటికి మానసిక, ఆధ్యాత్మిక శక్తుల పై ప్రాధాన్యాన్నిస్తుంది.CDTel 58.4

    “ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను” విసర్జించాలి అన్నది అపోస్తలుడైన పేతురు హెచ్చరిక. ఇది విచ్చలవిడి ప్రవర్తన గలవారికే వర్తిస్తుందని అనే కుల భావన. కాని దీనికి విస్కృత భావం ఉంది. హానికరమయిన ఆహార వాంఛను, లేక శరీరేచ్చను ఇది నిషేధిస్తుంది. టీ, కాఫీ, పొగాకు, సారా, నల్లమందు వంటి ఉత్తేజకాలు, మత్తుపదార్థాల వాడకానికి వ్యతిరేకంగా ఇది గట్టి హెచ్చరిక చేస్తుంది. వీటిపి నైతిక ప్రవర్తన పై హానికరమయిన ప్రభావం చూపే వాంఛల వర్గంలో పేర్కోవచ్చు. హానికరమయిన ఈ అలవాట్లు ఎంత చిన్నవయసులో ఏర్పడితే అవి బాధితుడ్ని తమ బానిసత్వంలో అంత పటిష్టంగా బంధించి అతడి ఆధ్యాత్మిక ప్రమాణాన్ని అంత నిశ్చయంగా దిగజార్చుతాయి.CDTel 58.5

    (1870) 2T 413,414 CDTel 59.1

    93. మీరు అన్ని విషయాల్లోనూ ఆశా నిగ్రహం పాటించాలి. మనసు తాలూకు ఉన్నత శక్తుల్ని పెంపొందించుకోండి. అప్పుడు పాశవికత పెరుగుదలకు తక్కువ బలం ఉంటుంది. మీ తిండి వాంఛ, శారీరక ఉద్రేకాలు పూర్తిగా అదుపులో లేనప్పుడు మీరు మీ ఆధ్యాత్మిక శక్తిని వృద్ధి పర్చుకోటం అసాధ్యం. ఆవేశపూరిత అపోస్తలుడంటున్నాడు, “ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబర్చుకొనుచున్నాను.”CDTel 59.2

    నా సహోదరుడా, నీవు మేల్కొని నీ వెలపలి విషయాల కన్నా నీ లోపలి విషయాల్ని దేవుని ఆత్మ పరిచర్య గాఢంగా సృశింప నివ్వమని నిన్ను బతిమాలు తున్నాను. ప్రతీ కార్య ఆరంభానికి దాన్ని చేరనివ్వు. ఆధ్యాత్మిక విషయాల్లోనూ ఐహిక విషయాల్లోనూ ధృఢమైన నియమం పటిష్ఠమైన చర్య అవసరం. నీ ప్రయత్నాల్లో నిర్దిష్టత లేదు. అయ్యో! ఎంతమంది ఆహార వాంఛను అధిగమించనందున ఆధ్యాత్మిక తాసులో తక్కువ తూగుతున్నారు! అతిగా తినటం వల్ల మెదడు నాడీమండలం దెబ్బతిని దాదాపు స్తభించి పోతుంది.CDTel 59.3

    అలాంటి వ్యక్తులు సబ్బాతునాడు దైవ మందిరానికి వెళ్ళినప్పుడు మెలకువగా ఉండటం కష్టమౌతుంది. నిద్రమత్తులో మునిగినవారి మనసుల్ని ఎలాంటి విజ్ఞప్తులు మేల్కొల్పలేవు. సత్యాన్ని తీవ్ర భావోద్వేగంతో సమర్పించవచ్చు, కానీ అది నైతిక సున్నితభావాల్ని మేల్కొల్పలేదు. అన్ని విషయాల్లో దేవుణ్ని మహిమ పర్చటానికి కృషిచేస్తారా? CDTel 59.4