Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆరోగ్య సంస్కరణ సిఫారసు లేదు

    (1880) 4T 416,417 CDTel 140.1

    227. తమ ఆహార అలవాట్ల గురించి మన బోధకులు ఎక్కువ పట్టించుకోటం లేదు. వారు తినే ఆహారం పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఒక్క భోజనంలో చాలా రకాల వంటకాలు తింటారు. కొందరు పేరుకు మాత్రమే సంస్కర్తలు. తమ ఆహారాన్ని నియంత్రించుకోటానికి నియమాలుండవు. భోజనానికీ భోజనానికీ మధ్య పండ్లు లేదా గింజలు తినటం వల్ల జీర్ణమండల అవయవాలకి ఎక్కువ శ్రమ కల్పిస్తారు. రెండుపూట్ల భోజనమే శరీరానికి ఆత్మకు ఆరోగ్యకరంగా ఉన్నపుడు కొందరు మూడుపూట్లా భోజనం చేస్తారు. శరీరవ్యవస్తను నడపటానికి దేవుడు ఏర్పాటుచేసిన చట్టాల్ని అతిక్రమిస్తే శిక్ష తప్పక వస్తుంది.CDTel 140.2

    తిండిలో అవివేకంగా ఉన్నందువల్ల కొందరి మానసిక శక్తులు సగం స్తంభించినట్లు కనిపిస్తుంది. వారు మందకొడిగా నిద్రకళ్లతో ఉన్నట్లు కనిపిస్తారు. తిండి సుఖభోగాల వంటి స్వార్థశరీరేచ్చల ఫలితంగా బాధలు భరిస్తున్న, పాలిపోయిన, ముఖాలుగల ఈ బోధకులు ఆరోగ్యసంస్కరణకు సిఫారసు కాజాలరు. అధిక శ్రమ మూలంగా అలసి నలతగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒకపూటే భోజనం చెయ్యటం చాలా మంచిది. ఇది ప్రకృతి పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తుంది. ఆరోగ్యసంస్కరణ గురించి బోధించటం కన్నా తమ ఆచరణ ద్వారా దాని పురోగతికి మన బోధకులు ఎక్కువ తోడ్పడగలుగుతారు. వారికోసం మిత్రులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినప్పుడు, నియమాలకు నీళ్లోదలటానికి వారికి బలమైన శోధన కలుగవచ్చు. కాని నోరూరించే వంటకాలు, మసాలాలు వేసి చేసిన పదార్థాలు, టీ, కాఫీలని తిరస్కరించటం ద్వారా వారు ఆచరణాత్మక ఆరోగ్య సంస్కర్తలుగా నిరూపించుకోవచ్చు. జీవిత చట్టాల ఉల్లంఘన పర్యవసానంగా ఇప్పుడు కొందరు అనారోగ్యం పాలై బాధపడూ ఆరోగ్య సంస్కరణ కృషికి దాని ప్రబోధకులకు చెడ్డ పేరు తెస్తున్నారు.CDTel 140.3

    తినటం తాగటం నిద్రపోవటం లేదా చూడటంలో అతిలాలసత్వం పాపం. శరీరం, మనసు శక్తులన్నీ కలిపి ఆరోగ్యవంతంగా చేసే పని ఫలితం సంతోషం. ఈ శక్తులు ఎంత సమున్నతం ఎంత నిర్మలం అయితే మన సంతోషం అంత పవిత్రంగా శుద్ధంగా ఉంటుంది.CDTel 141.1