Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    స్వస్తత కొరకు ప్రార్థన అసంగతమైనప్పుడు

    ఉత్తరం 200, 1903 CDTel 416.6

    713. ఈ విషయం పై వచ్చిన వెలుగును లక్ష్యపెట్టనివారు సెవెంతుడె ఎడ్వంటిస్టుల్లో ఉన్నారు. వారి ఆహారంలో మాంసం ఓ భాగమై ఉంటుంది. వారికి వ్యాధి సంప్రాప్తమౌతుంది. తమ తప్పుడు ఆహార విధానం వల్ల వ్యాధి బాధలకు గురి అయిన వారు దైవ సేవకుల్ని ప్రార్థించాల్సిందిగా కోరతారు. వారు తన చిత్రాన్ని నెరవేర్చటానికి సమ్మతంగా లేనప్పుడు, ఆరోగ్యసంస్కరణ పరంగా ఆయన ఉపదేశాన్ని ఆచరించటానికి నిరాకరించినప్పుడు, వారి పక్షంగా ప్రభువు ఎలా పనిచెయ్యగలడు?CDTel 416.7

    ముప్పయి సంవత్సరాలుగా ఆరోగ్యసంస్కరణపై దైవప్రజలకి వెలుగు వస్తున్నది. అయితే అనేకులు దాన్ని హాస్యాంశంగా తీసుకుంటున్నారు. వారు టీ, కాఫీ, మసాలాలు, మాంసపదార్థాలు ఉపయోగిస్తూనే ఉన్నారు. వారి శరీరాలు వ్యాధితో నిండి ఉన్నాయి. అలాంటి వారిని స్వస్తతకోసం మనం ప్రభువుకి ఎలా సమర్పించగలం అని నేనడుగుతున్నాను.CDTel 416.8

    (రచన1884) E. from U.T.2 CDTel 417.1

    714. వేడి బిస్కెట్టులు మాంస పదార్థాలు ఆరోగ్యసంస్కరణ నియమాలకి పూర్తి విరుద్ధం. ఉద్వేగం, శరీరాశల్ని పక్కన పెట్టి హేతుబద్ధంగా ఆలోచిస్తే మనం చచ్చిన జంతువుల మాంసం ముట్టం. మాంసపదార్థాలు అమ్మే అంగడి నుంచి వచ్చే వాసనకన్నా ఎక్కువ దుర్భరమైన వాసన మరేముంది? ఎవరి జిహ్వ అస్వాభావిక రుచుల సంస్కృతి వలన భ్రష్టం కాదో వారికి పచ్చి మాంసం వాసన మిక్కిలి అభ్యంతరకరం. భక్షించటానికి మూగజీవుల్ని వధించటం చూడటంకన్నా ఆలోచనాపరుల మనసుకి అప్రియమైన దృశ్యం ఉంటుందా? ఆరోగ్య సంస్కరణ పై దేవుడిచ్చిన వెలుగును అలక్ష్యం చేస్తే, అనారోగ్యదాయకమైన అలవాట్ల ద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే వారిని స్వసపర్చటానికి దేవుడు అద్భుతాలు చెయ్యడు.CDTel 417.2