Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    మన భోజన హోటళ్లకు అవకాశాలు - ప్రమాదాలు

    MS 27, 1906 CDTel 497.2

    815. బేటిల్ క్రీ లోని స్థలాల్లో మనం చేసిన సేవలాంటి సేవను నగరాల్లో చెయ్యటానికి తరుణం కలుగుతుందని నాకు వెలుగు ఇవ్వబడింది. ఈ వెలుగు ననుసరించి ఆరోగ్య భోజన హోటళ్లను స్థాపించటం జరిగింది. మన హోటలు పనివారు ప్రజలకు అవసరమైన వెలుగును అందించటంలో విఫలమయ్యేంతగా వ్యాపార స్వభావంలో మునిగిపోయే ప్రమాదముంది. మన హోటళ్ల ద్వారా మనకు అనేకమందితో పరిచయం ఏర్పడుతుంది. అయితే మన మనసులు లాభాపేక్షతో నిండితే దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేం. స్త్రీ పురుషుల్ని నిత్య నాశనం నుంచి రక్షించే సత్యాన్ని అందించటానికి కలిగే ప్రతీ అవకాశాన్ని మనం ఉపయోగించు కోవాలని ఆయన కోరుతున్నాడు. — లోని హోటలు పని ద్వారా ఎన్ని ఆత్మలు సత్యాన్ని అంగీకరించాయో తెలుసుకోటానికి నేను ప్రయత్నిస్తున్నాను. కొందరు రక్షణ సత్యాన్ని అంగీకరించి ఉండవచ్చు. కాని దేవుని చిత్తాన్ని అనుసరించి ఆయన సేవను చేసి వెలుగును ప్రకాశింపజేసి ఉంటే ఇంకా ఎక్కువ మంది మారుమనసు పొంది దేవున్ని విశ్వసించేవారు.CDTel 497.3

    హోటలు పనివారికి నేనీ హెచ్చరిక చెయ్యాలి: క్రితంలో చేస్తున్న రీతిగా పనిచెయ్యటం కొనసాగించకండి. ప్రస్తుత కాలానికి దేవుడుద్దేశించిన సత్యాన్ని ప్రజలకు అందించటానికి హోటలుని ఓ. సాధనంగా ఉపయోగించటానికి ప్రయత్నించండి. ఈ లక్ష్య సాధనకే మన భోజన హోటళ్లని స్థాపించటం జరిగింది...CDTel 497.4

    - హోటలులోని పనివారు — సంఘంలోని సభ్యులు సంపూర్ణ మారుమనసు పొందటం ఎంతైనా అవసరం. అందరికి తెలివి అనే వరం దేవుడిచ్చాడు. మీరు దేవునితో పోరాడటానికి శక్తిని పొందరా? “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వ్వస ముంచువారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.”CDTel 497.5