Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    భాగం II - గుడ్లు

    గుడ్లు వాడకం రానురాను ప్రమాదభరితం

    (1905) M.H.320,321 CDTel 377.8

    625. కొత్త దేశాల్లో లేదా పండ్లు, పప్పులు దొరకని పేదరికం ఉన్న జిల్లాల్లో నివసించేవారికి తమ ఆహారంలో పాలు, గుడ్లు వాడకూడదని . విజ్ఞప్తి చెయ్యకూడదు. కండపట్టి ఉన్నవారు , ఎవరిలో పాశవిక ఉద్రేకాలు బలంగా ఉంటాయో వారు ఆవేశాలు పుట్టించే ఆహారపదార్థాలకి దూరంగా ఉండాలన్నది వాస్తవమే. కాని ఎవరి రక్తం ఉత్పత్తి చేసే అవయవాలు బలహీనంగా ఉంటాయో-ముఖ్యంగా అవసరమైన ఆహార మూలపదార్థాలు సరఫరా చేసే ఆహారపదార్ధాలు లభ్యం కాకపోతే- వారు పాలని గుడ్లని పూర్తిగా విసర్జించకూడదు. ఆరోగ్యంగా ఉన్న ఆవుల నుంచి పాలు, ఆరోగ్యంగా ఉన్న బాగా మేతవేసి పెంచిన కోడి పెట్టల. నుంచి గుడ్లు సేకరించటంలో జాగరూకత వహించాలి. గుడ్లని సులువుగా జీర్ణమయ్యేరీతిగా వండాలి.CDTel 377.9

    ఆహార సంస్కరణ ప్రగతిశీలంగా ఉండాలి. జంతువుల్లో వ్యాధులు పెరిగే కొద్దీ పాలు, గుడ్లు రానురాను ప్రమాదభరితమౌతాయి. వాటిస్థానే ఆరోగ్యకరమైన, చౌకైన ఇతర పదార్ధాల్ని ఉపయోగించటానికి ప్రయత్నించాలి. అన్నిచోట్ల సాధ్యమైనంత మేరకు పాలు, గుడ్లు లేకుండా అయినా ఆరోగ్యదాయకంగా, రుచిగా భోజనం ఎలా వండాలో ప్రజలకి నేర్పించాలి.CDTel 378.1