Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    విద్యలో ప్రాముఖ్యమైన శాఖ

    తినటానికి ప్రీతికరంగా ఉండేందుకు ఆహారాన్ని పలు విధాలుగా ఆరోగ్యవంతంగా ఎలా తయారు చెయ్యాలో నేర్చుకోటం వంట చేసేవారి మతపరమైన విధి. తల్లులు తమ బిడ్డలకి వంట చెయ్యటం నేర్పించాలి. విద్యలో ఏ విభాగం దీనంత ప్రాముఖ్యం గలది? తిండి జీవితానికి సంబంధించిన విషయం. సరిగా వండని, నిస్సారమైన, స్వల్పమైన ఆహారం రక్తాన్ని తయారుచేసే అవయవాల్ని బలహీనపర్చటం ద్వారా రక్తాన్ని భ్రష్టపర్చుతుంది. వంట కళను విద్యలో ఓ శాఖగా పరిగణించటం అత్యవసరం. వంట బాగా చేసేవారు చాలా తక్కువమంది. వంట పని హీనవృత్తి అని భావించి యువతులు వంటగత్తెలవ్వటం లేదు. సమస్య ఇది కాదు. వారు ఈ అంశాన్ని సరియైన దృక్కోణంలో చూడటం లేదు. ఆహారాన్ని మరీ ముఖ్యంగా బ్రెడ్డుని ఆరోగ్యవంతంగా తయారుచెయ్యటం అల్ప విషయం కాదు. అది ఓ శాస్త్రం ....CDTel 269.1

    తమ కుమార్తెల విద్యలోని ఈ శాఖను తల్లులు నిర్లక్ష్యం చేస్తుంటారు. పని భారాన్ని, ఆలనా పాలనా భారాన్ని తానే చేపట్టి దర్శించటానికి లేక తన వినోదాన్ని వెతుక్కోటానికి కూతుర్ని విడిచి పెట్టి, సనంతా తానే చేసి బలహీనురాలౌతాది తల్లి. ఇది తప్పుడు ప్రేమ, తప్పుడు దయ. తల్లి తన బిడ్డకి హాని చేస్తుంది. తరచు అది ఆమె జీవితకాలమంతా కొనసాగే హాని. జీవిత బరువు బాధ్యతల్ని మోయగల వయసు వచ్చినప్పుడు, ఆమె అసమర్థురాలౌతుంది. అలాంటి వారు భారాలు వహించరు. ఎక్కువ పని లేకుండా తేలికగా ఉండటానికి చూస్తారు. పనల బరువుతో ఉన్న బండిలా తల్లి పనల భారంకింద కుంగిపోతూ ఉండగా కుమార్తె బాధ్యతను తప్పించుకంటుంది. కుమార్తె తల్లిపట్ల నిర్దయగా ఉండాలని కాదు. కానీ అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉంటుంది. లేదంటే, అలసిపోయిన ఆమె వాలకాన్ని, ఆమె ముఖంలో వ్యక్తమౌతున్న బాధని గుర్తించి తన వంతు భారాన్ని భరించటానికి, ఎక్కువ భారం మోసి, పని చెయ్యలేని ఆ తల్లికి లేదా బాధతో మంచంపట్టే స్థితికి, బహుశ మరణ స్థితికి చేరుకున్న తల్లికి విశ్రాంతి నివ్వటానికి ప్రయత్నించేది.CDTel 269.2

    తల్లులు అంతగా గుడ్డివారై తమ కుమార్తెల శిక్షణని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? వివిధ కుటుంబాల్ని సందర్శించే తరుణంలో తల్లి కుటుంబ విధుల భారాలు మోస్తుండగా ఉత్సాహం ఉద్రేకాలతో నిండి, మంచి ఆరోగ్యం, శక్తితో కళకళలాడుతున్న కూతురుకి శ్రద్ధగాని, చింతగాని లేనట్లు చూసి వేదన చెందాను. పెద్ద సమావేశాలు జరిగేటప్పుడు కుటుంబాల పై ఎక్కువ మందికి ఆతిథ్యమిచ్చే భారం ఉన్నప్పుడు, కుమార్తెలు సాంఘికంగా సందర్శిస్తున్న స్నేహితులతో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా, తల్లి ఆ పనంతా తానే చెయ్యటం నేను చూశాను. ఈ విషయాలు నాకు చాలా తప్పుగా కనిపించాయి. ఆ యువతుల వద్దకు వెళ్లి ఆ పని చెయ్యండి, అలసివున్న మీ తల్లికి కాస్త విశ్రాంతి ఇవ్వండి. పార్లర్ లోకి తీసుకు వెళ్లి ఆమెని ఓ సీటులో కూర్చోబెట్టి కొంత సేపు విశ్రమిస్తూ తన స్నేహితులతో ఊసులాడుతూ ఆనందించనివ్వండి, అని చెప్పేవరకూ నా మనసు మనసులో లేదు.CDTel 270.1

    ఈ విషయంలో తప్పంతా కూతుళ్లదే కాదు. తల్లి తప్పు కూడా ఉంది. వంట ఎలా చెయ్యాలో ఆమె తన కుమార్తెలకు నేర్పలేదు. వంటచెయ్యటం వారికి రాదని ఆమెకు తెలుసు. కనుక తన పనినుంచి విశ్రమించటానికి లేదని ఆమెకు తెలుసు. శ్రద్ధ, ఆలోచన, గమనం అవసరమైన ప్రతి పనిని ఆమె చెయ్యాలి. యువతులకు వంటచెయ్యటంలో శిక్షణ ఇవ్వాలి. వారి జీవిత పరిస్థితులు ఎలాంటివైనా వారు వంట చెయ్యటంలో జ్ఞానాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించవచ్చు. విద్యలోని ఈ శాఖ మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా మిక్కిలి ప్రియులుగా పరిగణించబడేవారి జీవితాల పై.CDTel 270.2

    సరియైన విద్య పొందనందువల్ల వంటశాఖలో నిపుణత లోపించిన అనేకమంది భార్యలు, తల్లులు ప్రతీదినం తమ కుటుంబాలకి సరిగా తయారుచెయ్యని ఆహారాన్ని, తమ జీర్ణమండల అవయవాల్ని నాశనం చేసి, నాణ్యతలేని రక్తాన్ని తయారుచేసి, తరచు మంట పుట్టించే వ్యాధి దాడులకు లోను చేసి అకాల మరణానికి దారి తీసే ఆహారాన్ని సమర్పిస్తున్నారు......CDTel 270.3