Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    విభాగం XVIII—పండ్లు, తృణధాన్యాలు, కూరగాయలు

    భాగం I - పండ్లు తాజా పండ్లు ఓ దీవెన

    ఉత్తరం 157, 1900 CDTel 319.1

    464. ఆదాము తన ఏదెను గృహాన్ని పోగొట్టుకున్నప్పుడు, ప్రభువు పండ్ల సరఫరాని ఆపలేదు. అందుకు దేవునికి కృతజ్ఞురాలిని.CDTel 319.2

    (1902) 7T 126 CDTel 319.3

    465. సంవత్సరంలో ఎక్కువ కాలం తాజా పండ్లు దొరికే దేశాల్లో నివసించే వారు ఈ పండ్లవల్ల పొందగల మేలుని గుర్తించాల్సిందిగా ప్రభువు కోరుతున్నాడు. చెట్ల నుంచి కోసిన పండ్ల పై ఎంత ఎక్కువగా ఆధారపడితే మనకు కలిగే మేలు అంత ఎక్కువగా ఉంటుంది.CDTel 319.4

    (1902) 7T 134 CDTel 319.5

    466. తక్కువ వంట చేసుకుని ఎక్కువ పండ్లని సహజ స్థితిలో తినటం మనకు మేలు చేస్తుంది. తాజా ద్రాక్షలు, ఏపిల్లు, పీచు, పేర్లు, బెర్రీలు, దొరికే పండ్లన్నీ తినటం ప్రజలకి మనం నేర్పించాలి. వీటిని చలికాలంలో ఉపయోగించుకోటానికి టిన్ను డబ్బాలకన్నా గాజు కూజాల్లో నిలవచేసుకోవాలి. పండ్లు మంచి ఆహారం అవి వంటని చాలా వరకు తగ్గిస్తాయి-546)CDTel 319.6

    (1870) 2T 373 CDTel 319.7

    467. అజీర్తి రోగులు తినటానికి మీ భోజన బల్లలమీద రకరకాల పండ్లు పెట్టవచ్చు. కాని ఒకేసారి ఎక్కువ రకాల పండ్లు పెట్టకూడదు.CDTel 319.8

    MS 43, 1908 CDTel 319.9

    468. ప్రత్యేకించి పండ్లని ఆరోగ్యాన్నిచ్చే సాధనంగా సిఫారసు చేస్తున్నాం. కాని కడుపు నిండా భోజనం చేసిన తర్వాత పండ్లని సయితం తినకూడదు.CDTel 319.10

    ఉత్తరం 12, 1887 CDTel 320.1

    469. వాటి కాలంలో దొరికే నాణ్యమైన కూరగాయల్ని సరిగా తయారుచేస్తే అవి ఎంతో ఆరోగ్యదాయకం. కాని అవి కుళ్లిపోతున్న సూచనలు లేనివి, తెగులువల్ల దెబ్బతిననివి అయి ఉండాలి. చెడిపోయిన పండ్లు, చెడిపోయిన కూరగాయలు తినటం వల్ల అవి కడుపులో పులిసి రక్తాన్ని విషకలితం చేసి ఊహకు మించిన సంఖ్యలో జనుల మరణాలకి కారణమౌతున్నాయి.CDTel 320.2

    ఉత్తరం 103, 1896 CDTel 320.3

    470. దేవుని సేవ చెయ్యటానికి సిద్ధపడుతున్నవారి భోజనబల్లల పై సామాన్యమైన, సాదాసీదా పండ్లు ఉదారంగా సమకూర్చితే అది వారికి అత్యుత్తమ ఆహారం. (ఆరోహణానికి సిద్ధపడుతున్న వారికి పండ్లు, గింజలు ఆహారం-488,515] CDTel 320.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents