Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అలవాట్లు, ఆచారాల్లో అవసరమైన మార్పులు మాత్రమే అమలు పర్చండి

    ఉత్తరం 213, 1902 CDTel 292.4

    425. ఆసుపత్రి పనికి సంబంధించిన వారు రోగులు ఎక్కడుంటే అక్కడ వారిని కలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడని జ్ఞాపకముంచు కోవాలి. ప్రస్తుత కాల సత్యానికి సంబంధించిన సమస్యల్ని సమర్పించటంలో మనం దేవునికి సహాయకులుగా సేవ చెయ్యాలి. మన ఆసుపత్రుల్లో రోగులుగాగాని అతిథులుగా గాని ఉన్నవారి అలవాట్లు ఆచారాలలో అనవసరంగా కలుగజేసుకోటానికి ప్రయత్నించకూడదు. అనేకులు కొన్ని వారాలుండటానికి మాత్రమే ఈ ప్రశాంత స్థలానికి వస్తారు. అంతకొద్ది కాలానికి తమ భోజన సమయాన్ని మార్చుకోమనటం వారిని ఎంతో అసౌకర్యానికి గురిచెయ్యటమౌతుంది. ఇది చేస్తే తప్పుచేశామని మీ పరిశోధన అనంతరం మీరు తెలుసుకుంటారు. రోగుల అలవాట్లను గురించి మీరే తెలుసుకోగలిగింది తెలుసుకోండి గాని ఈ అలవాటు మార్చుకోమని వారిని కోరకండి. ఆ మాకు కలిగే లాభం ఏమీ ఉండదు.CDTel 292.5

    ఆసుపత్రి వాతావరణం ఆనందంగా, ఇంటిలోలా, సాధ్యమైనంత సాంఘికంగా ఉండాలి. చికిత్స కోసం వచ్చేవారికి తమ ఇంట్లో ఉన్నట్లు స్వేఛ్చాభావాన్ని కలిగించాలి. భోజనవేళల్లో అర్ధాంతరంగా చేసే మార్పులు మనసుల్ని గలిబిలి పర్చుతాయి. వారి అలవాట్లలో అంతరాయం ఫలితంగా అసౌకర్యభావం ఏర్పడుతుంది. వారి మనసుల్లో ఆందోళన చోటు చేసుకుంటుంది. ఇది అస్వాభావిక పరిస్థితుల్ని సృష్టిస్తుంది. అందుమూలంగా అవసరమైనప్పుడు ఆ మార్పు జాగ్రత్తగా, అది ఓ అసౌకర్యంగా గాక ఓ మేలుగా వారు భావించేటట్టుగా చక్కగా చెయ్యాలి.....CDTel 293.1

    వీటన్నింటిని స్పష్టంగా గ్రహించటానికి విద్యలేనివారికి సయితం మీ నిబంధనలు న్యాయంగా కనిపించేంత నిలకడ కలవై ఉండాలి. నవీకరణ, పరివర్తన కలిగించే సత్యం తాలూకు నియమాల్ని, ఆరోగ్యం పొందటానికి మన ఆసుపత్రికి వచ్చేవారి జీవిత సరళిలోకి ప్రవేశపెట్టటానికి మీరు ప్రయత్నించేటప్పుడు, తమపై నిరంకుశ నిబంధనలు విధించటం లేదని వారికి కనపర్చండి. తాము ఎంచుకోని మార్గాన్ని అనుసరించటానికి తమని ఒత్తిడి చెయ్యటం జరుగుతుందని భావించటానికి వారికి ఎలాంటి హేతువు ఇవ్వకండి.CDTel 293.2