Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పరిశుద్ధీకరణతో అలవాట్ల సంబంధం

    R.& H., జనవరి 25, 1881 CDTel 166.1

    254. స్వార్థపరులు తిండిబోతులుగా ఉంటూ పరిశుద్దీకరణ ఆశీర్వాదాల్ని పొంది ఆనందించటం అసాధ్యం. జీవిత చట్టాల్ని ఆరోగ్య చట్టాల్ని అతిక్రమిస్తూ తినటం తాగటం వంటి చెడు అలవాట్ల కారణంగా దుర్బలతల భారంకింద మూలుగుతూ ఉంటారు. అనేకులు తమ వక్రతిండి వల్ల జీర్ణమండల అవయవాల్ని బలహీన పర్చుకుంటారు. మానవ శరీరతత్వం దానికి జరిగే దుర్వినియోగాన్ని ప్రతిఘటించటానికి అద్భుత శక్తి ఉంటుంది. కాని అతి తిండి తాగుడు దురభ్యాసాల్లో ఎడ తెగ కుండా కొనసాగటం శరీరం నిర్వర్తించాల్సిన ప్రతీ విధిని నిర్వహించకుండా బలహీనపర్చుతుంది. దుర్వినియోగం చేసే బదులు మితంగా నివసిస్తూ ఆరోగ్యాన్ని ప్రోది చేసి వుంటే, తాము ఎలాగుందురో ఈ దుర్బలులు పరిగణించటం మంచిది. తిండి వాంఛను శరీరేచ్చల్ని తృప్తి పర్చుకోటంలో క్రైస్తవులుగా చెప్పుకునేవారు సయితం ప్రకృతి చేసే పనిని కుంటుపర్చి శారీరక, మానసిక, నైతిక శక్తిని క్షీణింపజేస్తున్నారు. ఈ పని చేస్తున్న కొందరు దేవుని పరిశుద్ధులమని చెప్పుకుంటారు. కాని దానికి ఎలాంటి పునాదీ లేదు....CDTel 166.2

    “ఒక కుమారుడు తండ్రిని ఘనపరచునుగదా, దాసుడు తన యజమానుని మనపరచునుగదా; నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యములకధిపతియగు యెహోవా మిమ్మునడుగగా-ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందురు. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనబల్లను నీచపరచి నందుచేతనేగదా. గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించిన యెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. మరియు దోచబడిన దానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు; మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా? అని యెహోవా అడుగుచున్నాడు.”CDTel 166.3

    ఈ హెచ్చరికల్ని మందలింపుల్ని జాగ్రత్తగా ఆలకిద్దాం. పూర్వం ఇశ్రాయేలు ప్రజల్ని ఉద్దేశించి పలికినప్పటికీ ఈ మాటలు నేడు మనకూ వర్తిస్తాయి. తమ శరీరాల్ని “దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా” సమర్పించుకోవలసిందంటూ దేవుని వాత్సల్యాన్ని బట్టి తన సహోదరులకి విజ్ఞప్తి చేస్తున్న అపొస్తలుడి మాటల్ని మనం పరిగణించాలి. ఇదే వాస్తవిక పరిశుద్ధత. అది కేవలం ఓ సిద్ధాంతం కాదు. భావోద్వేగం కాదు. లేదా మాటతీరు కాదు. కాని అది దినదిన జీవితంలో ప్రవేశించే సజీవమైన,CDTel 167.1

    క్రియాత్మకమైన నియమం. తప్పు అలవాట్లవల్ల భ్రష్టమైన కానుకగా కాక మన ఆహార పాన వస్త్రధారణ అలవాట్లను శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యాన్ని పెంపొందించేవిగా ఉంచుకుని మనం మన శరీరాల్ని పరిశుద్ధ దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా సమర్పించాలి.CDTel 167.2

    దైవభక్తులమని చెప్పుకునే వారిలో ఎవరూ శరీరారోగ్యాన్ని అలక్ష్యం చేసి, అదంత పాపం కాదని, అది తమ ఆధ్యాత్మికతకు విఘాతం కలిగించదని భావించకుందురుగాక. శారీరక మానసిక స్వభావాల మధ్య ప్రగాఢ సానుభూతి ఉంటుంది.CDTel 167.3