Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    తిండి వాంఛ స్వైర విహారం చెయ్యకూడదు

    (1870) 2T 381.383 CDTel 225.1

    336. బిడ్డల్ని ప్రసవించటానికి పూర్వం స్త్రీ జీవిత సరళిలో వ్యత్యాసం చూపకపోవటం సాధారణంగా జరిగే తప్పిదం. ప్రాముఖ్యమైన ఈ కాలావధిలో తల్లి చేయాల్సిన పని తేలికగా ఉండాలి. ఆమె శరీర వ్యవస్థలో గొప్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శరీరానికి ఎక్కువ రక్తం అవసరం. కనుక రక్తంగా నూరటానికి మంచి సాష్ఠకాహారం ఎక్కువ అవసరమౌతుంది. ఆమెకు పోషకాహారం సమృద్ధిగా సరఫరా అయితేనే తప్ప తన శారీరక శక్తిని నిలుపుకోలేదు; ఆమె సంతానం జీవశక్తిని కోల్పోతుంది. ఆమె వస్త్రధారణ విషయంలోను శ్రద్ధ అవసరం. శరీరాన్ని చలినుంచి కాపాడటంలో శ్రద్ధ తీసుకోవాలి. దుస్తుల పరంగా శరీరానికి చాలినంత రక్షణ లేనందువల్ల ఆమె తన జీవశక్తిని అనవసరంగా పైకి రప్పించాల్సిన అవసరం ఏర్పడ కూడదు. తల్లికి ఆరోగ్యదాయకమైన, పౌష్ఠికమైన ఆహారం సమృద్ధిగా లభించకపోతే ఆమెకు పరిమాణం పరంగాను నాణ్యత పరంగాను రక్తం కొరవడుతుంది. ఆమె రక్త ప్రసారం చురుకుగా సాగదు. ఆమె బిడ్డలోను ఇదే పరిస్థితి చోటుచేసుకుంటుంది. ఆహారాన్ని శరీర వ్యవస్థ పోషణకు అవసరమయ్యే మంచి రక్తంగా మార్చుకునే శక్తి ఆమె సంతానానికి అంతగా ఉండదు. తల్లి బిడ్డల క్షేమాభివృద్ధులు వెచ్చని వస్త్రాలు పోషణనిచ్చే ఆహారం పై చాలా ముట్టుకు ఆధారపడి ఉంటాయి. తల్లి తన జీవశక్తిని అదనంగా ఉపయోగించటం పరిగణలోకి తీసుకుని ఆమెకు చాలినంత రక్షణనిచ్చే వస్త్రాలు ఏర్పాటు చెయ్యాలి.CDTel 225.2

    కాగా స్త్రీలు తమ ప్రత్యేక పరిస్థితివల.. తమ తిండిని యధేచ్చగా సాగనియ్యవచ్చునన్న అభిప్రాయం ఆచారం మీద ఆనుకున్న పొరపాటే గాని సుబుద్ధిమీద ఆనుకున్నది కాదు. ఈ పరిస్థితిలో ఉన్న స్త్రీల ఆహార వాంఛ మారుతూ నిలకడగా లేకుండా ఉండటం వల్ల దాన్ని తీర్చటం కష్టమౌతుంది. తన శరీరానికి గాని తన బిడ్డ పెరుగుదలకు గాని అలాంటి ఆహారం పోషణ నిస్తుందా లేదా అన్న విషయంతో నిమిత్తం లేకుండా ఆమె కోరింది ఆమెకి వ్వటానికి ఆచారం అనుమతిస్తుంది. ఆహారం పౌష్ఠికతనివ్వాలి. అది ఉద్రేకాన్ని పుట్టించేది కాకూడదు. ఆమె మాంసాహారం, పచ్చళ్ళు, మసాలాలు కారం ఎక్కువగా ఉన్న భోజనం లేదా పైలు కోరితే వాటిని ఆమెకివ్వాలని ఆచారం చెబుతుంది. భోజనాన్ని, రుచిని మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదు. ఇది పెద్ద తప్పు. అది కలిగించే హాని అంతా ఇంతా కాదు. ఆహారంలో సామాన్యత, ప్రత్యేక జాగ్రత్త అవసరం ఎప్పుడైనా ఉందంటే అది ప్రాముఖ్యమైన ఈ సమయంలోనే.CDTel 225.3

    నియమబద్ధత కలిగి, సరిగా ఉపదేశం పొందిన స్త్రీలు ముఖ్యంగా ఈ సమయంలో సామాన్యమైన ఆహారం నుంచి వైదొలగరు. మరో ప్రాణం తమపై ఆధారపడి ఉన్నదని గుర్తించి, తమ అలవాట్ల విషయంలో నురీ ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటారు. వారు పోషణలేని, ఉద్రేకం పుట్టించే ఆహారాన్ని అది రుచిగా ఉన్నందుకు మాత్రమే తినకూడదు. తమ సుబుద్ధి వద్దని చెప్పే చాలా వాటిని చెయ్యటానికి ప్రోత్సహించే హితవరులు చాలామంది ఉన్నారు.CDTel 226.1

    తిండి దురేచ్ఛను తృప్తి పర్చుకునే తల్లిదండ్రులుకి వ్యాధులు గల పిల్లలు జన్మిస్తారు. వారి మనసు నిలిచిన రకరకాల ఆహారం వారి శరీర వ్యవస్థకి అవసరమవ్వలేదు. మనసులో ఉన్నది కడుపులో పడాలి అన్నది గొప్ప పొరపాటు. క్రైస్తవ స్త్రీలు ఈ పొరపాటు చెయ్యకూడదు. శరీర వ్యవస్థ వాంఛలు ఊహ నియంత్రణ కింద ఉండ కూడదు. రుచిని రాజ్యమేలనిచ్చేవారు తమ శరీర చట్టాల ఉల్లంఘన శిక్షను అనుభవిస్తారు. ఈ విషయం ఇక్కడితో అంత మొందదు. వారి అమాయక సంతానం కూడా బాధలకు గురి అవుతారు.CDTel 226.2

    రక్తాన్ని తయారుచేసే అవయవాలు మసాలాల్ని, కయిమా పైలని, పచ్చళ్లని, వ్యాధి గ్రస్తమైన మాంస పదార్థాల్ని మంచి రక్తంగా మార్చలేవు. జీర్ణమండల అవయవాలు పరిష్కరించటానికి వ్యవస్థలో మంట పుట్టించే పదార్థాల్ని నివారించటానికి అధిక శ్రమ పడాల్సినంత ఆహారం కడుపులోకి తీసుకుంటే, తల్లి ...ు హాని కంచుకుని, తన సంతాసంలో వ్యాధులకి పునాది వేస్తుంది. ఆమె పర్యవసానాల్ని పరిగణించకుండా కోరినదంతా యథేచ్చగా తినటానికి నిర్ణయించుకుంటే శిక్షననుభవిస్తుంది; కాని అది ఒంటరిగా కాదు. ఆమె అవివేకం ఫలితంగా’ అన అమాయక శిశువు బాధకు గురి అవుతుంది.CDTel 226.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents