Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ప్రతీ సంఘంలో, సంఘ పాఠశాలలో, మిషను సేవా క్షేత్రంలో

    (1905) M.H.149 CDTel 493.3

    809. క్రైస్తవ పనివారిని తర్బీతు చెయ్యటానికి ప్రతీ సంఘం ఓ శిక్షణ కేంద్రం కావాలి. బైబిలు బోధన ఎలా నిర్వహించాలో సబ్బాతు బడి ఎలా జరపాలో, సబ్బాతుబడి తరగతులు ఎలా బోధించాలో, బీదవారికి ఎలా సహాయం చెయ్యాలో, జబ్బుగా ఉన్నవారికి ఎలా పరిచర్య చెయ్యాలో, విశ్వసించని వారికోసం ఎలా సేవ చెయ్యాలో సంఘ సభ్యులికి నేర్పించాలి. ఆరోగ్యం గురించి బోధించటానికి, వంట చెయ్యటం నేర్పించటానికి పాఠశాలలుండాలి. అనేక విధాలుగా క్రైస్తవ సహాయం అందించటానికి తరగతులు నడపాలి. బోధించటమే కాదు అనుభవంగల ఉపదేశకుల నాయకత్వంలో క్రియాత్మకమైన సేవ జరగాలి.CDTel 493.4

    MS 79, 1900 CDTel 493.5

    810. ప్రతీ ఆరోగ్య భోజన హోటలూ దానితో సంబంధమున్న పనివారికి పాఠశాలగా ఉండాలి. చిన్న చిన్న స్థలాల్లో కన్నా నగరాల్లో ఈ పని ఎక్కువగా జరగాలి. అయితే ఎక్కడ ఓ సంఘం సంఘ పాఠశాల ఉంటాయో అక్కడ ఆరోగ్య సంస్కరణ సూత్రాల ప్రకారం నివసించగోరేవారి ఉపయోగార్థం సామాన్యమైన ఆరోగ్య సూత్రాల ననుసరించి ఆహారం తయారు చేసుకోటం నేర్పించాలి. మన మిషనరీ సేవా క్షేత్రాలన్నింటిలోను ఇలాంటి సేవ జరగాలి.CDTel 493.6

    పండ్లు, విత్తనాలు, గింజలు, దుంపల్ని కలిపి ఆరోగ్యదాయకమైన ఆహారంగా మార్చేపని దేవునిది. మన సంఘం స్థాపితమైన ప్రతీ స్థలంలోను సభ్యులు దేవునిముందు వినయంగా నడవాలి. ఆరోగ్యసంస్కరణ సూత్రాల పై వారు ప్రజల్ని ఉత్తేజపర్చాలి. CDTel 494.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents