Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సామాన్య, సులభ, ఆరోగ్యకర తయారి

    MS 78, 1902 CDTel 278.4

    401. ఆరోగ్యాహార అంశం పై ప్రభువు నాకిచ్చిన ఉపదేశాన్ని ఇప్పుడు నేను నా సహోదరులకి ఇవ్వాలి. ఆరోగ్య ఆహార పదార్ధాల్ని అనేకులు మానవుడి సంకల్పంగా పరిగణిస్తున్నారు. కాని తన ప్రజలకు దీవెనగా అవి దేవుడు ఆదిలో ఇచ్చినవి. ఆరోగ్య ఆహార పదారాల కృషి దేవుని ఆస్తి. దాన్ని వ్యక్తిగత లాభం కోసం ఆర్ధికపరమైన ఊహలకు గురి చెయ్యకూడదు. ఆహారాంశం పై దేవుడు ఇచ్చిన, ఇంకా ఇస్తున్న వెలుగు ఇశ్రాయేలు ప్రజలకి మన్నా ఎలాగున్నదో నేడు దేవుని ప్రజలకి అలాగుండాలి. మన్నా పరలోకం నుంచి పడగా ప్రజలు దాన్ని పోగుచేసుకుని తినటానికి తయారు చేసుకోవాల్సి ఉంది. అలాగే లోకంలోని ఆయా దేశాల్లోని దైవ ప్రజలకి దేవుడు వెలుగు నిస్తాడు. ఈ దేశాలకి అనుకూలమైన ఆరోగ్య ఆహార పదార్థాలు తయారు చెయ్యబడతాయి.CDTel 278.5

    ప్రతీ సంఘానికి చెందిన సభ్యులు దేవుడు తమకిచ్చిన చాతుర్యాన్ని మేధాశక్తిని పెంపొందించుకోవాలి. సామాన్యంగా సులభంగా తయారు చెయ్యటానికి అనుకూలంగా ఉన్న, ప్రజలకి మాంసాహారానికి మిష లేకుండేందుకు మాంసానికి ప్రత్యామ్నాయంగా ఉండే, ఆహార పదార్థాల్ని తయారు చెయ్యటానికి భూమి ఉత్పత్తుల్ని ఎల’ సంయోగం చెయ్యాలో నేర్చుకోటానికి తమ శక్తి సామర్థ్యాల్ని ఉపయోగించటానికి సమ్మతంగా ఉన్న వారికి నిపుణతని అవగాహనని ప్రభువు ఇస్తాడు.CDTel 279.1

    అట్టి ఆహార పదార్థాల్ని తయారుచేసే ప్రత్యేక జ్ఞానాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడో వారు తమ జ్ఞానాన్ని స్వార్థరహితంగా ఉపయోగించాలి. పేదలైన తమ సహోదరులుకి సహాయం చెయ్యాలి. వారు తామే ఉత్పత్తిదారులు వినియోగదారులు అవ్వాలి. ఆరోగ్య ఆహార పదార్థాలు అనేకCDTel 279.2

    స్థలాల్లో ఉత్పత్తి అవ్వాలన్నది దేవుని ఉద్దేశం. సత్యాన్ని అంగీకరించేవారు సామాన్య ఆరోగ్య ఆహారపదార్థాల్ని ఎలా తయారుచెయ్యాలో నేర్చుకోవాలి. బీదలు జీవితావసర ఆహార పదార్థాలు లేక బాధపడటం దేవుని పంకల్పం కాదు. వివిధ దేశాల్లో ఉన్న తన ప్రజలు వివేకం కోసం తనను ప్రార్థించాలని ఆ మీదట ఆయన ఇచ్చే వివేకాన్ని సరిగా వినియోగించాలని దేవుడు కోరుతున్నాడు. మనం నిసృహతో నిరాశతో మిగిలి పోకూడదు. ఇతరుల్ని చైతన్యపర్చటానికి మన శక్తి మేరకు ప్రయత్నించాలి.CDTel 279.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents