Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    విభాగం XIV—ఆరోగ్యకరంగా చేసే వంట

    తక్కువ రకం వంట ఓ పాపం

    MS 95, 1901 CDTel 257.1

    368. సరిగా తయారు చెయ్యని ఆహారాన్ని భోజనబల్ల మీద పెట్టటం ఓ పాపం. ఎందుకంటే తిండి శరీర వ్యవస్థ క్షేమాభివృద్ధికి సంబంధించిన విషయం. పుల్లని కడుపులు, ఫలితంగా చిరచిరలాడే స్వభావాలు లేకుండేటట్లు ఆహారం తయారుచేసే అవసరాన్ని తన ప్రజలు అభినందించాలని ప్రభువు కోరుతున్నాడు. సరిగా తయారు చేసిన ఓ బ్రెడ్డు ముక్కలో బోలెడు ఆచరణాత్మక మతం ఉన్నదని జ్ఞాపకముంచుకుందాం.CDTel 257.2

    వంట జ్ఞానం పది వరాలకన్నా ఎక్కువ విలువైనదిCDTel 257.3

    వంట పనిని ఓ రకమైన దాస్యంగా చూడకూడదు. వంట పనికి ఉచిత గౌరవం లేదన్న సాకుతో ఈ పనిలో ఉన్నవారందరూ పని మానేస్తే లోకంలో ఉన్నవారందరికీ ఏమి సంభవిస్తుంది? కొన్ని ఇతర పనులకన్నా వంటపని తక్కువ వాంఛనీయంగా కనిపించవచ్చు. అయితే వాస్తవంలో శాస్త్రాలన్నింటికన్నా వంట ఓ ఉన్నతమైన శాస్త్రం. ఆరోగ్యదాయకమైన ఆహారం తయారుచెయ్యటాన్ని దేవుడు ఇలా పరిగణిస్తున్నాడు. ఆరోగ్యదాయకమైన రుచికరమైన, ఆహారం తయారుచేసే వారిని గూర్చి ఆయనకి ఉన్నతాభిప్రాయం ఉంటుంది. ఆహారం సరిగా తయారుచేసే కళను అవగాహన చేసుకుని ఉపయోగించే వ్యక్తి మరే ఇతర పనిచేసే వ్యక్తికన్నా ఉన్నతమైన మెచ్చుకోలు పొందటానికి అర్హురాలు. ఈ వరం పది వరాలతో సమానం. ఎందుకంటే దాని సరియైన వినియోగంతో మానవ యంత్రాంగపు ఆరోగ్యం ముడిపడి ఉన్నది. జీవితంతోను ఆరోగ్యంతోను అంత దగ్గర సంబంధం కలిగి ఉండబట్టే అది వరాలన్నిటిలోను మిక్కిలి విలువైనది.CDTel 257.4