Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    మాంసపదార్థాలుగా వర్గీకరించకూడదు

    (1902) 7T 135 CDTel 378.2

    626. పాలు, గుడ్లు, బటర్ ని మాంసపదార్థాలుగా వర్గీకరించకూడదు. కొందరి విషయంలో గుడ్లు వాడకం మేలు చేస్తుంది. పాలు, గుడ్లవినియోగం మానాల్సిన సమయం ఇంకా రాలేదు.....CDTel 378.3

    ఆహార సంస్కరణ ప్రగతిశీలమవ్వాలి. పాలుగాని బటగాని ఉపయోగించకుండా ఆహారం ఎలా తయారు చెయ్యాలో ప్రజలకి నేర్పించాలి. మనుషుల మధ్య పెరుగుతున్న దుర్మారతకి దీటుగా గుడ్లు, పాలు, వెన్న లేక బటర్ ఉపయోగించటంలో ప్రమాదం పెరిగే కాలం త్వరలో వస్తుందని వారికి చెప్పండి. పతనమైన మానవ జాతి దుర్మార్గత కారణంగా భూమికి శాపంగా ఉన్న వ్యాధుల తాకిడి కింద జంతు సృష్టి యావత్తు మూలిగే సమయం దగ్గరలోనే ఉన్నది. ఇవి లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం తయారు చెయ్యటానికి దేవుడు తన ప్రజలకి సామర్ధ్యాన్ని నేర్పుని ఇస్తాడు. మన ప్రజలు అనారోగ్యకరమైన రెసిపీలని నిరాకరించాలి.CDTel 378.4