Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    నీచ ఆవేశాల్ని బలపర్చుతుంది

    (1869) 2T 352 CDTel 404.1

    683. ఆహారం మిక్కిలి సామాన్యంగా ఉండవలసిన సమయం ఎన్నడైనా ఉంటే అది ఇప్పుడే. మన పిల్లల ముందు మాంసం పెట్టకూడదు. అది నీచ ఆవేశాల్ని రెచ్చగొట్టి బలపర్చే ప్రభావం చూపుతుంది. నైతిక శక్తుల్ని మొద్దుబార్చుతుంది.CDTel 404.2

    MS 50, 1904 CDTel 404.3

    684. మాంసం వాడకం స్వభావాన్ని పాశవికం చేసి పురుషులు, స్త్రీలు ఇతరులపట్ల కనపర్చవలసిన అనురాగాన్ని సానుభూతిని దోచుకుంటుందని నాకు వచ్చిన ఉపదేశం చెబుతున్నది. మనం తీసుకునే ఆహారమే మనల్ని నిర్మిస్తుంది. ఎవరి ఆహారం ఎక్కువగా మాంసపదార్థాలతో కూడి ఉంటుందో వారు తమ శారీరక ఉన్నత శక్తుల్ని తమ నీచ ఉద్రేకాలు ఆవేశాల అదుపులో ఉంచే స్థితికి దిగజారారు......CDTel 404.4

    ఆహారం విషయంలో పలానా మార్గం అవలంబించాలని మేము నిర్ధారించి చెప్పలేము. ఆరోగ్యవంతమైన ఆహారం అనేక రకాలు. కాని దైవప్రజలకి మాంసాహారం మంచిది కాదని మాత్రం చెప్పుతాం. అది మానవుల్ని పాశవికుల్ని చేస్తుంది. పండ్లు, గింజలు, పప్పులు సమృద్ధిగా ఉన్న ఇలాంటి దేశంలో, ఓ వ్యక్తి తాను చచ్చిన జంతువుల మాంసం తినాలని ఎలా అనుకోగలడు?CDTel 404.5

    ఉత్తరం 200, 1903 CDTel 404.6

    685. మన సంఘసభ్యులైన వారి కుటుంబాల్లో పరిస్థితులు ఉండాల్సిన విధంగా ఉంటే మనం ప్రభువుకి రెండంతలు సేవచెయ్యగలుగుతాం. ఆరోగ్య సంస్కరణ విషయంలో మనం మిక్కిలి నిర్ణయాత్మక వర్తమానాన్ని అందించాలని నాకు వచ్చిన వెలుగు చెబుతున్నది. మాంసం తినేవారు క్షుద్ర ప్రవృత్తుల్ని బలపర్చి, తమ పై వ్యాధి పట్టు బలపడటానికి మార్గం సుగమం చేస్తారు.CDTel 404.7

    (1868) 2T 60,61 CDTel 405.1

    686. మీ కుటుంబ సభ్యులు మాంసాంహారులు. వారిలో పాశవిక చిత్తవృత్తులు బలపడుతున్నాయి, మానసిక శక్తులు బలహీనపడుతున్నాయి. మనం తినే ఆహారం మనల్ని తీర్చిదిద్దుతుంది. కాగా మనం చచ్చిన జంతువుల మాంసం ఎక్కువగా తింటే వాటి స్వభావాన్ని పంచుకుంటాం. మీరు మీ వ్యవస్థలోని క్షుద్రభాగాన్ని ప్రోత్సహించి, ఎక్కువ సున్నితం, నాజూకు అయిన భాగాన్ని బలహీనపర్చుకుంటున్నారు.CDTel 405.2

    జనరల్ కాన్ఫరెన్స్ బులిటస్, ఏప్రి.12, 1901 CDTel 405.3

    687. ఈ సదస్సు అంతం కాకముందు ప్రతీ ఒక్కరి హృదయాన్ని దైవ వాక్యంలోని సత్యం ప్రభావితం చెయ్యాలని ఆశిస్తున్నాం. తమకు ఆహారంగా జంతువుల మాంసం మంచిది కాదని వారు అవగాహన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్టి ఆహారం వారిలోను వారి పిల్లల్లోను పాశవిక ఉద్రేకాల్ని వృద్ధిపర్చుతుంది. తినటంలోను, బట్టలు ధరించటం లోను, పని చెయ్యటంలోను మన పిల్లలకి సరియైన అలవాట్లు నేర్పించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. చెడిపోయిన యంత్రాంగాన్ని బాగు చెయ్యటంలో మనం చెయ్యగలిగింది చెయ్యాలని ఆయన కోరుతున్నాడు. పిల్లల పై మాంసం, విలాస భోజనాల ప్రభావం-348,350,357,361,578, 621,71]CDTel 405.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents