Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సంస్కరణలోని నాయకులు

    ఉత్తరం 48, 1902 CDTel 417.3

    715. మాంసాహారాన్ని సంఘసభ్యత్యానికి పరీక్షగా మనం పరిగణించం, మాంసం తినవద్దంటూ ఎవర్నీ ఒత్తిడి చెయ్యం . అయినా కాన్ఫరెన్సుకి చెందిన ఏ వాక్యపరిచారకుడు ఆ విషయాన్ని చులకనగా చూడకూడదని, సంస్కరణని వ్యతిరేకించకూడదని అభ్యర్థించటం మన విధి. మాంసాహారం శరీరవ్యవస్థపై చూపే దుష్ప్రభావాన్ని గూర్చి ప్రభువిచ్చిన వెలుగు మనకున్నా మీరు మాంసం తినటం కొనసాగిస్తే దాని పర్యవసానాల్ని మీరే భరించాలి. కాని మాంసాహారం విషయంలో సంస్కరణకి పిలుపు నివ్వటం అవసరం లేదన్న వాదనతో ప్రజల ముందుకి వెళ్లటం చెయ్యవద్దు. ఎందుకంటే ప్రభువు ఈ విషయమై సంస్కరణకి పిలుపునిస్తున్నాడు. మనకు ఆరోగ్యసంస్కరణ వర్తమానాన్ని ప్రకటించే పనిని ప్రభువు నియమించాడు. ఈ వర్తమానాన్ని అందించే వారిలో మీరు ప్రధాన స్థానంలో లేకపోతే దానికి ప్రాధాన్యాన్నివ్వలేరు. ఆరోగ్యసంస్కరణని ప్రబోధిస్తూ పని చేస్తున్న వారి కృషిని వ్యతిరేకిస్తూ మీరు సంస్కరణకి విరుద్ధంగా పనిచేస్తున్న వారవుతారు.CDTel 417.4

    [ఆరోగ్యసంస్కరణ ముందుకి సాగుతుంది. ప్రతిఘటించకుండా జాగ్రత్త పడండి-42]CDTel 418.1

    పసిఫిక్ యూనియన్ రికార్డర్, అక్టో.9, 1902 CDTel 418.2

    716. దేవుని దూతలుగా అనుచిత ఆహార వాంఛకు వ్యతిరేకంగా మనం నిర్ణయాత్మకమైన సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదా?... పండ్లు, గింజల్ని దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు. వాటిని ఆరోగ్యవంతంగా తయారు చేసి సరియైన పరిమాణాల్లో ఉపయోగించుకోవాలి. ఇలాగుండగా, మనుషులు ఎందుకు మాంసాహారం తీసుకుంటారు? మాంసం తింటున్నవారి భోజనబల్లల వద్ద కూర్చుండే వాక్య పరిచారకులు వారితో కలిసి మాంసం తినరన్న నమ్మకం మనం కలిగి ఉండగలమా?...CDTel 418.3

    “మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలెను.” ఆరోగ్యచట్టాల్ని అతిక్రమించేవారందరూ దేవుని ప్రసన్నతని కోల్పోతారు. స్వార్ధాన్ని ఉపేక్షిస్తూ, క్రీస్తు ప్రవర్తనలోని సద్గుణాల్ని ఆచరిస్తూ మనం గ్రత్తగా నడుచుకుంటే దినదినం దేవుని ఆత్మ మనకు ఎంతగా లభిస్తుంది!CDTel 418.4

    MS 113, 1901 CDTel 418.5

    717. మన వాక్య పరిచారకులు, గ్రంధ విక్రయ సేవకులు మితానుభవాన్ని నిష్కర్షగా ఆచరించాలి. ‘క్షమించండి; నేను మాంసం తినను. చచ్చిన జంతువుల మాంసం తినకుండా ఉండటం నేను మనస్సాక్షితో పాటించే నియమం” అని ఖండితంగా చెప్పండి. ఎవరైన టీ ఇస్తే దానికి కారణాలు చెబుతూ తిరస్కరించండి. టీ హానికరమని, కొంత సేపు ఉత్సాహాన్ని ఇచ్చినప్పటికీ ఆ ఉత్సాహం త్వరలోనే మాయమౌతుందని, దానికి దీటైన నిరుత్సాహం సంభవిస్తుందని విశదం చెయ్యండి.CDTel 418.6

    ఉత్తరం 135, 1902 CDTel 418.7

    718. మాంసం గురించి దాన్ని ముట్టవద్దని మనందరం అనవచ్చు. టీ, కాఫీలు తాగకుండా ఉంటూ వాటికి వ్యతిరేకంగా అందరూ సాక్ష్యం ఇవ్వాలి. అవి మత్తు పదార్థాలు. అవి మెదడుకి, శరీరంలోని ఇతర అవయవాలకి హాని కలిగిస్తాయి. పాలు, గుడ్లు వాడటాన్ని పూర్తిగా విసర్జించాల్సిన సమయం ఇంకా రాలేదు. పాలని గుడ్లని మాంసపదార్థాలుగా వర్గీకరించకూడదు. కొన్ని వ్యాధులకి గుడ్లు వాడకం గొప్ప మేలు చేస్తుంది.CDTel 418.8

    మన సంఘ సభ్యులు ప్రతీ విధమైన అనుచిత ఆహారేఛ్చను నిరాకరించాలి. టీ, కాఫీ, మాంస పదార్థాలకి వ్యయం చేసే ప్రతీ పైస ఊరకే వ్యర్ధం చేసిన ద్రవ్యం. ఇవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల అభివృద్ధికి ప్రతిబంధకాలవుతాయి.CDTel 419.1

    [వైట్ గృహంలో మాంసం ఉపయోగించటం గాని ఇ.జి.వైట్ మాంసం ఉపయోగించటం గాని జరగలేదు అనుబంధం 1:4,5,8,10,14,15,16,17, 18,21,23]CDTel 419.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents