Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    తీవ్ర ధోరణి అవలంబించకండి

    ఈ విషయంపై మీరు దృష్టి పెట్టకపోతే మీ సంస్థ పెరిగేబదులు క్షీణిస్తుంది. ఆరోగ్య సంస్కరణ విషయంలో తీవ్ర వైఖరి అవలంబించే ప్రమాదం ఉంది.CDTel 297.4

    గత రాత్రి నిద్రలో నేను డా. ---- తో మాట్లాడుతున్నాను. అతనితో ఇలా అన్నాను, “ఆహారం విషయంలో తీవ్ర భావాల గురించి నీవింకా శ్రద్ధ వహించాలి. నీ సొంత సందర్భంలోనైనా ఆసుపత్రిలో సహాయకులకి రోగులకి ఆహారం సరఫరా విషయంలోనైనా నీవు తీవ్రభావాలతో హద్దులు మీరకూడదు. రోగులు తమ ఆహారం కోసం డబ్బు చెల్లిస్తున్నారు. వారికి సమృద్ధిగా ఆహారం ఇవ్వాలి. కొందరు ఆహార వాంఛను కఠినంగా తిరస్కరించాల్సిన పరిస్థితిలో ఆసుపత్రికి రావచ్చు. కానీ వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే కొద్దీ వారికి బలవర్ధక ఆహారం ఉదారంగా ఇవ్వాలి.CDTel 297.5

    ఇది నేను రాయటం నీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఆహారంలో మార్పు మీ ఆదరణలో గొప్ప తేడాని కలిగిస్తుందని గత రాత్రి నాకు ఉపదేశం వచ్చింది. మరింత ఉదార ఆహారం అవసరం.CDTel 298.1

    ఉత్తరం 1271904 CDTel 298.2

    429. ఆసుపత్రిలో ఆహారం విషయంలో తీవ్ర ధోరణులు చోటు చేసుకునే ప్రమాదం గురించి జాగ్రత్తగా ఉండాలి. మన ప్రజలు సంవత్సరాల కొద్దీ నేర్చుకుంటున్న విషయాల్ని లోకస్తులు వెంటనే అంగీకరిస్తారని మనం ఎదురుచూడకూడదు. తమకు వెలుగు ఉన్నప్పటికీ ఇప్పుడు సైతం మన వాక్యపరిచారకుల్లో ఆరోగ్య సంస్కరణను పాటించని వారు చాలా మంది ఉన్నారు. ఈ అంశం పై వ్యావహారికమైన అనుభవం లేనివారు, ఆహారం విషయంలో సంయమనం అవసరాన్ని గుర్తించనివారు, స్వార్థాశలు, ఆరోగ్య సంస్కరణలోని కఠిన ఆహారని, మధ్య విశాలమైన మెట్టు ఎక్కాలని ఎదురుచూడలేం.CDTel 298.3

    ఆసుపత్రికి వచ్చేవారికి సరియైన నియమాలకు అనుగుణంగా, రుచిగా తయారుచేసిన, ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. మనం నివసిస్తున్నట్లు వారు నివసించాలని మనం ఎదురుచూడ కూడదు. అది చాలా పెద్ద మార్పు. డా. ---- వివేకమని భావించి ఆశను నిగ్రహించుకుని , నివసించినట్లు నివసించగలవారు మన మధ్య బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. రోగులు వాటికి సిద్ధపడనప్పుడు మార్పులు హఠాత్తుగా చెయ్యకూడదు.CDTel 298.4

    రోగుల ముందు పెటే ఆహారం వారికి మంచి అభిప్రాయం కలిగించేటట్లు ఉండాలి. గుడ్లు రకరకాలుగా తయారుచెయ్యవచ్చు. లెమన్, పైని నిషేధించకూడదు.CDTel 298.5

    ఆహారాన్ని రుచిగాను, పౌష్టికంగాను తయారుచెయ్యటానికి ఆలోచించటం, శ్రద్ధతో పనిచెయ్యటం జరగటంలేదు. ఆసుపత్రిలో రోగులు లేని పరిస్థితి ఏర్పడకూడదు. మనుషులతో వివేకవంతంగా వ్యవహరిస్తేగాని మనం వారిలో మార్పుతేలేం. CDTel 298.6

    మంచి వంటమనిషిని పెట్టుకోండి. కొందరు కఠినమైన ఆరోగ్యసంస్కర్తల రుచుల్ని బట్టి ఆహారాన్ని పరిమితం చెయ్యకండి. రోగులకి ఈ ఆహారాన్ని మాత్రమే ఇస్తే వారికి విసుగు పుడుతుంది. ఎందుకంటే అది చప్పగా ఉంటుంది. మన ఆసుపత్రుల ద్వారా ఆత్మల్ని రక్షించే పద్ధలి ఇది కాదు. ఆహారం విషయంలో పద్దతి తీవ్రధోరణి గురించి సోదరుడు, సోదరీ - లకు ప్రభువిచ్చిన హెచ్చరికను పాటిద్దాం. డా. - - - తన ఆహారం మార్చి ఎక్కువ పోషణనిచ్చే ఆహారం తినాలని దేవుడు నాకు తెలిపాడు. గొప్ప వంట అవసరం లేకుండా కమ్మని ఆహారం తయారుచెయ్యటం సాధ్యమే. ఆహారం విషయంలో ఆసుపత్రిలోకి తెచ్చే ప్రతీ తీవ్రధోరణి సంస్థ మంచి పేరుని దెబ్బతీస్తుంది......CDTel 298.7

    ఆరోగ్యవంతంగాను పౌష్టికంగాను ఉండేటట్లు ఆహార పదార్థాల్ని మిశ్రమం చేసి తయారు చేసే విధం ఒకటున్నది. మన సేనిటేరియాల్లో వంట విషయంలో అజమాయిషి గలవారు దీన్ని సాధించటం ఎలాగో అన్నదానిపై మంచి అవగాహన కలిగి ఉండాలి. ఇది బైబిలుని దృష్టిలో ఉంచుకుని జరిగించాల్సినపని. దేహానికి అందించాల్సిన పౌష్టికతను, దోచుకోటమనేది జరగుతుందని తెలుసా! ఆహారాన్ని ఉత్తమ రీతిలో తయారు చెయ్యటం ఓ శాస్త్రం కావాలి.CDTel 299.1

    [సేనిటేరియం ఆహారం తయారీ సందర్భంగా అదనపు సమాచారం-324, 33]CDTel 299.2