Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అతి తిండి వెంట వ్యాధి

    (1905) M.H.227 CDTel 119.7

    200. శరీరాశల్ని తృప్తిపర్చుకోటం ద్వారా అనేకమంది తమ మీదికి జబ్బులు తెచ్చుకుంటారు. వారు ప్రకృతి చట్టానికి విధేయులై నివసించరు లేదా పవిత్రత సూత్రాలికి కట్టుబడి ఉండరు. ఇతరులు తమ భోజన పానాలు, వస్త్రధారణ, పని అలవాట్ల విషయంలో ఆరోగ్య చట్టాల్ని లెక్క చెయ్యరు.CDTel 119.8

    Y.I. జనవరి 31, 1894 CDTel 120.1

    201. అనుచిత ఆహారం అనుచిత సమయాల్లో తినటం వల్ల, ఆరోగ్య చట్టాల్ని నిర్లక్ష్యం చెయ్యటంవల్ల మనసు అలసి, దెబ్బతిన్నంతగా, కఠిన శ్రమలవల్ల, కఠిన అధ్యయనం వల్ల అలసి, దెబ్బతినదు..... మానసిక శక్తులు దెబ్బతినటానికి ప్రధాన కారణం కష్టపడి చదవటం కాదు. దానికి ముఖ్యకారణం అనుచిత ఆహారం, వేళతప్పి భుజించటం, శరీర వ్యాయామం లేకపోటం. భోజనం చెయ్యటానికి నిద్రపోవటానికి వేళలు పాటించకపోటం మేధాశక్తుల్ని బలహీనపర్చుతుంది.CDTel 120.2

    (1900) 6T 372,373 CDTel 120.3

    202. తిండి ప్రీతి కారణంగా అనేకమంది బాధ అనుభవిస్తున్నారు. అనేకమంది సమాధుల్లోకి వెళ్తున్నారు. వారు తమ వక్రతిండికి ఏది అనుకూలిస్తే అది తిని, తమ జీర్ణమండల అవయవాల్ని బలహీనపర్చుకుని, తమ శరీర పోషణకు అవసరమైన ఆహారాన్ని జీర్ణించుకునే శక్తిని కోల్పోతారు. ఇది తీవ్ర వ్యాధికి హేతువవుతుంది. పర్యవసానంగా మరణం సంభవిస్తుంది. విజ్ఞతగలవారి ఆత్మహత్యా సదృశమైన అభ్యాసాల కారణంగా సున్నితమైన శరీర యంత్రాంగం బలహీన పడుతుంది.CDTel 120.4

    సంఘాలు దేవుడు తమకిచ్చిన వెలుగులో ధృఢంగా యదార్థంగా నిలవాలి. ప్రతీ సభ్యుడు తిండి తపనను దూరంగా ఉంచటానికి జ్ఞానయుక్తంగా కృషి చెయ్యాలి.CDTel 120.5

    [పేదరికపు ఆహారం వల్ల కలిగే వ్యాధుల్ని స్వస్తపర్చటం కష్టం-315] CDTel 120.6

    [స్వభావం పై గృహవాతావరణం పై అనుచిత ఆహార ప్రభావం-234] CDTel 120.7

    [అపార్థం చేసుకున్న సంస్కరణ ఫలితాలు-316] CDTel 120.8