Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    శాఖాహారాన్ని విధించటంలో జాగరూకత

    ఉత్తరం 54, 1896 CDTel 302.1

    434. వ్యాధి. వ్యాధికి కారణాల పై దేవుడిచ్చిన వెలుగును ఎక్కువగా అధ్యయనం చెయ్యటం అవసరం. ఎందుకంటే ఆహారవాంఛను తృప్తిపర్చే తప్పుడు అలవాట్లు, శరీరాన్ని సరిగా సంరక్షించుకోటంలో అశ్రద్ధ, ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. శుచి శుభ్రత అలవాట్లు, నోటిలో వేసుకుని నమిలే వాటి విషయంలో జాగరూకత పాటించాలి.CDTel 302.2

    మాంస పదార్థాలు వాడ కూడదని మీరు చికిత్సా దేశాలు రాయకూడదు. కానీ ఉపదేశంతో మీరు మనసుని వికాసవంతం చెయ్యాల్సి ఉంది. వక్రతిండి నుంచి ఆత్మరక్షణ, ఆత్మ పవిత్రత విషయంలో వ్యక్తిగత మనస్సాక్షి మేల్కోవాలి.....CDTel 302.3

    మాంసాహార సమస్య విషయంలో జాగరూకత అవసరం. ఉద్రేకం పుట్టించే మాంసాహారం నుంచి పండ్లు, కూరగాయల ఆహారానికి మారేటప్పుడు మొదట్లో ఎప్పుడూ బలహీనంగా ఉన్నట్లు జీవశక్తి కొరవడినట్లు అనిపిస్తుంది. అనేకులు దీన్ని ఆధారం చేసుకుని మాంసాహారం అవసరమని వాదిస్తారు. కాని ఈ ఫలితమే మాంసాహారాన్ని విసర్జించటానికి ఉపయోగించాల్సిన తర్కం.CDTel 302.4

    ఈ మార్పుని హఠాత్తుగా చెయ్యాలని కోరకూడదు, ముఖ్యంగా ఎప్పుడూ మాంసం తింటూ ఆ భారం కింద ఉన్నవారిని. వారి మనస్సాక్షిని చైతన్య పర్చి, వారి చిత్రాన్ని పటిష్ఠపర్చండి. అప్పుడు ఆ మార్పు సులువుగాను వారి ఇష్టపూర్వకంగాను చోటుచేసుకుంటుంది. నెమ్మదిగా మరణాన్ని సమీపిస్తున్న క్షయ రోగులు ఈ విషయంలో ప్రత్యేకమైన మార్పులు చెయ్యకూడదు. కాని వారు ఆరోగ్యవంతమైన జంతువుల మాంసం కొనటంలో జాగరూకత వహించాలి.CDTel 302.5

    ప్రాణాన్ని హరిస్తున్న కంతులతో బాధపడున్న వ్యక్తుల్ని మాంసాహారం తినటమా మానటమా అన్న ప్రశ్నతో ఆయాసపర్చనవసరం లేదు. ఈ విషయంలో కఠిన తీర్మానం తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి కింద మార్పులు చెయ్యటం వల్ల ప్రయోజనముండదు. అది మాంసం తినకూడదన్న నియమాలకి విఘాతం కలిగిస్తుంది. సమావేశ హాలులో ఉపన్యాసాలివ్వండి. మనసుకి బోధించండి, కాని ఎవరినీ ఒత్తిడి చెయ్యకండి. ఒత్తిడి ద్వారా సాధించే సంస్కరణ నిరుపయోగం.....CDTel 302.6

    జంతు సృష్టి అంతా ఇంచుమించుగా వ్యాధి గ్రస్తమైందని విద్యార్థులకి వైద్యులకి వారి ద్వారా ఇతరులకి సమర్పించటం అవసరం. వ్యాధిగ్రస్తమైన మాంసం అరుదుకాదు, సర్వసామాన్యం. చచ్చిన జంతుమాంసం తినటం ద్వారా వ్యాధి దశలన్నీ మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి. మాంసాహారం నుంచి జరిగిన మార్పు ఫలితంగా కలిగే దుర్బలత, బలహీనత త్వరగా పోతాయి. తాము మాంసాహార ప్రేరకాన్ని ఆరోగ్యానికి బలానికి ఆవశ్యకం చెయ్యకూడదని వైద్యులు గ్రహించాలి. మార్పుకి అలవాటు పడిన తర్వాత దాన్ని జ్ఞానయుక్తంగా కొనసాగించే వారందరూ ఆరోగ్యవంతమైన స్నాయువులు, కండరాలు కలిగి ఉంటారు.CDTel 303.1

    ఉత్తరం 231, 1905 CDTel 303.2

    435. ఏ పరిస్థితుల్లోనైనా, ఓ వ్యక్తి జబ్బుగా ఉండి కడుపులోకి ఏమీ తీసుకోలేకుంటే, కోడి సూప్ తాగమని మీరు సూచిస్తారా? అని డా.నన్ను అడిగింది. ” క్షయతో మరణిస్తున్న వ్యక్తులున్నారు. వారు కోడి సూప్ కావాలంటే ఇవ్వు. కాని జాగ్రత్తగా ఉండాలి.” అని ఉత్తరమిచ్చాను. ఈ సాదృశ్యం ఓ ఆసుపత్రికి హాని కలిగించకూడదు లేక ఇతరులు తమ పరిస్థితికి కూడా అలాంటి ఆహారమే అవసరమని చెప్పటానికి సాకు కాకూడదు. తనకు అలాంటి రోగి ఉన్నదా అని డా. — ని అడిగాను. “లేదు. కాని — లోని ఆసుపత్రిలో నా సోదరి ఉంది. ఆమె ఒకలాంటి కుదుపుల వ్యాధితో బాధపడుతుంది. కాని ఆమె వండిన కోడిని తినగలదు.” అన్నది. “ఆమెని ఆసుపత్రిలోనుంచి ఇంటికి తీసుకువెళ్లటం మంచిది... నీవు చెప్పిన నీ సోదరి ధైర్యం తెచ్చుకుని ఆరోగ్యదాయకమైన ఆహారానికి ఇష్టత పెంచుకుంటే ఈ కుదుపులన్నీ పోతాయి” అని చెప్పాను.CDTel 303.3

    ఆమె తన ఆలోచనను అలా తర్బీతు చేసుకుంది. అపవాది ఆమె శారీరక దుర్బలతని సొమ్ముచేసుకుంటున్నాడు. అనుదినం ఎదురయ్యే కష్టాల్ని ఎదుర్కోటానికి ఆమె తన మనసుని పటిష్ఠపర్చుకోలేదు. ఆమెకు కావలసింది శుద్దీకరించబడిన మానసిక స్వస్తత, విశ్వాసం పెరుగుదల, క్రీస్తుకి క్రియాశీలమైన సేవ. ఇంకా ఆమెకు అవసరమయ్యింది బయట ఆచరణాత్మక శ్రమ ద్వారా తన కండరాలకి వ్యాయామం. శరీర వ్యాయామం ఆమెకు తన జీవితంలో అతి గొప్ప దీవెన అవుతుంది. ఆమె బలహీనురాలు కానక్కరలేదు. ఆమె ఆరోగ్యవంతమైన మనసు కలిగిన, ఆరోగ్యవంతురాలైన స్త్రీగాను తన పాత్రను ఉదాత్తంగా నిర్వహించటానికి సిద్ధపడ్డ స్త్రీగాను నివసించాలి.CDTel 303.4

    ఈ సహోదరి తన పాత్రను నిర్వహించకపోతే ఆమెకు చేసే చికిత్స అంతా వ్యర్ధమౌతుంది. శారీరక శ్రమ ద్వారా ఆమె తన కండరాల్ని, నరాల్ని బలపర్చుకోవాలి. ఆమె అశక్తురాలు కానవసరం లేదు. ఆమె చక్కగా శరీర శ్రమ చెయ్యవచ్చు. CDTel 304.1

    [అత్యవసర పరిస్థితుల గుర్తింపు-699,700) CDTel 304.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents