Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఎదుర్కొన్న కష్టాలు, ఫలితంగా రాజీలు

    ఉత్తరం 83, 1901 CDTel 510.2

    10. ముప్పయి ఏళ్ళు పైచిలుకు క్రితం నాకు తరచు బలహీనత ఏర్పడేది. నా నిమిత్తం అనేక ప్రార్థనలు చేయటం జరిగింది. మాంసాహారం నాకు బలం చేకూర్చుతుందని తలంచారు. కాబట్టి మాంసమే నా ప్రధాన ఆహారమయ్యింది. కాని బలపడటానికి బదులు నేను నానాటికీ బలహీన పడుతున్నాను. తరచు అలసిపోయి పడిపోయేదాన్ని. మాంసం భుజించటం వల్ల స్త్రీ పురుషులు మానసికంగాను, నైతికంగాను, శారీరకంగాను హానికి గురి అవుతున్నారని చూపిస్తూ నాకు వెలుగు వచ్చింది. ఈ ఆహారం మానవ శరీర నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని దాని వల్ల మనిషిలో పాశవిక ప్రవృత్తులు బలీయమై సారాకి తృష్ణ పుట్టిస్తాయని నాకు ప్రత్యక్షపర్చబడింది.CDTel 510.3

    నేను వెంటనే మాంసం తినటం మానేశాను. ఆ తర్వాత కొన్నిసార్లు మాంసం తినాల్సిన తప్పనిసరి పరిస్థితుల్ని నేను ఎదుర్కొన్నాను.CDTel 510.4

    [ఇతర ఆహారపదార్ధాలు దొరకనప్పుడు కొన్నిసార్లు అనివార్యమైన మాంసాహారం-699]CDTel 510.5

    గమనిక : బాలికగా ఉన్న దినాలనుంచే శ్రీమతి వైట్ గ్రంథ రచన, బహిరంగ సువార్త సేవ బాధ్యతలు వహించింది. కనుక ఇంటిపనులు చాలా వరకు పనివారు, సేవకులు వంటకత్తెలు నిర్వహించేవారు. ఆరోగ్యవంతంగా వండటంలో శిక్షణ పొందిన వంటవారు ఎల్లప్పుడూ దొరికేవారు కాదు. కనుక ఆదర్శ ప్రమాణాలకి కొత్త వంటకత్తెల జ్ఞానం, అనుభవం, ప్రమాణాల మధ్య రకరకాల రాజీలు చోటుచేసుకునేవి. ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా తాను ఎవరిని సందర్శిస్తుందో వారిమీద ఎక్కువ భాగం తన భోజనానికి ఆమె ఆధారపడేది. మితాహారం తిని ఉండగలిగినా కొన్నిసార్లు మాంసం తినటం అనివార్యమయ్యేది. అది ఉత్తమాహారం కాదని ఆమెకు తెలుసు. అది ఆమె ఎంచుకున్నది కాదు కూడా. - సంకలన కర్తలు.CDTel 510.6

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents