Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆహారపరమైన కాఠిన్యం మంచిది కాదు

    ఉత్త రం 37, 1901 CDTel 370.13

    612. మనం సామాన్య ప్రజలతో సంబంధం కలిగి ఉండాలి. ఆరోగ్య సంస్కరణని తీవ్ర రూపంలో వారికి ఉపదేశించటం ప్రమాదకరం. మాంసం తినవద్దని, టీ కాఫీలు తాగవద్దని వారికి చెబుతాం. అది మంచిదే. కొందరు పాల వాడకం కూడా మానేయ్యమని చెబుతారు. ఈ అంశం పై జాగ్రత్తగా వ్యవహరించటం అవసరం. కొన్ని పేద కుటుంబాలున్నాయి. వారి ఆహారం పాలు, బ్రెడ్, కొద్దిగా వండ్లు దొరికితే అవి మాత్రమే. మాంసపదార్థాలన్నింటిని విసర్జించాలి. కాని కొద్దిగా పాలు లేదా వెన్న లేదా అలాంటిదేదైనా ఉపయోగించి కూరగాయల్ని రుచిగా తయారుచెయ్యాలి. తమకు ఆరోగ్య సంస్కరణ వర్తమానం అందించినప్పుడు “మేము ఏమి తినాలి? పప్పులతో తయారైన భోజన పదార్థాల్ని మేము కొనలేం” అని పేదవారు అడుగుతారు. బీదవారికి సువార్త ప్రకటించేటప్పుడు తమకు మిక్కిలి పోషణనిచ్చే ఆహారం తినాలని వారికి బోధించాల్సిందిగా ప్రభువు నన్ను ఆదేశిస్తాడు. “గుడ్లు తినవద్దని, పాలు, వెన్న ఉపయోగించవద్దని, ఆహారం తయారు చేసుకోటంలో బటర్ వాడవద్దని” వారికి చెప్పలేను. పేదలకి సువార్త ప్రకటించాలి. కఠినమైన ఆహార విధింపుకి సమయం ఇంకా రాలేదు.CDTel 370.14

    ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పాలు, వెన్న, గుడ్లు వంటి ఆహార పదార్థాల్లో కొన్నింటిని విసర్జించాల్సిన సమయం వస్తుంది. అయితే మనం అకాల, తీవ్ర ఆంక్షల్ని విధించుకుని మన మీద మనం ఆందోళన, చింత వేసుకోనవసరం లేదు. పరిస్థితులు దాన్ని సూచించేవరకు వేచి ఉండండి. దానికి దేవుడే మార్గం సిద్ధం చేస్తాడు. CDTel 371.1

    రోగులకి ఆహారం విషయంలో నీ అభిప్రాయాలు సరియైనవి కావు. మార్పు చాలా పెద్దది. మాంసాహారం హానికరం కనుక దాన్ని విడిచి పెట్టాల్సి ఉండగా, తక్కువ హానికర పదార్థాన్ని ఉపయోగించవచ్చు. ఇది గుడ్డుల్లో ఉంది. పాలని భోజనబల్ల మీదనుంచి తీసెయ్యకండి లేక వంటలో దాని వినియోగాన్ని నిషేధించకండి. ఆరోగ్యంగా ఉన్న ఆవులనుంచి పాలు సేకరించి వాటిని బాగా కాచి వాడాలి. CDTel 371.2

    ఇప్పటిలా పాలు వెన్న, బటర్, గుడ్లు వాడటం ఇక క్షేమం కాని సమయం వచ్చినప్పుడు, దాన్ని దేవుడు మనకు తెలుపుతాడు. ఆరోగ్య సంస్కరణ సందర్భంగా తీవ్రభావాలు ప్రచురించకూడదు. పాలు, బటర్, గుడ్లు ఉపయోగించటాన్ని గూర్చిన సమస్య దాని పరిష్కారాన్ని అదే కనుగొంటుంది. ప్రస్తుతం ఇది మన సమస్యకాదు. మీ మితానుభవం అందరికి వెల్లడి కానివ్వండి. పాలు, బటర్ స్థానే ఆరోగ్య ఆహారపదార్థాల వాడకం-583)CDTel 371.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents