Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వెలుగు నిమిత్తం బాధ్యత

    గుడ్ హెల్త్, నవంబర్, 1880 CDTel 7.5

    13. ఆరోగ్య సంస్కరణను గూర్చి మనకు వెలుగు వచ్చిన దినాల్లోను, అప్పటినుంచీ మనకు అనుదినం వస్తున్న ప్రశ్నలు ఇలాంటివి: “నేను అన్ని విషమాల్లోనూ ఆశానిగ్రహం పాటిస్తున్నానా?” “నేను అత్యంత మేలు చెయ్యగలిగే ఆరోగ్యస్థితిలో ఉండేటట్లు నా ఆహారం నన్ను తీర్చిదిద్దేదిగా ఉందా?” వీటికి ఔనని సమాధానం చెప్పలేకపోతే మనం దేవుని ముందు నిందితులమవుతాం. ఎందుకంటే, మన మార్గంలో ప్రకాశించే వెలుగుకి ఆయన మనల్ని బాధ్యుల్ని చేస్తాడు. అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసీ చూడనట్లు ఉంటాడు. అయితే మన పై వెలుగు ప్రకాశించే కొద్దీ మనం ఆర్యోగ్యానికి హాని కలిగించే అలవాట్లు మాని భౌతిక చట్టాలకు అనుగుణంగా నివసించాలని ఆయన కోరాడు.CDTel 7.6

    (1890) C.T.B.H.150 CDTel 8.1

    14. ఆరోగ్యం మహా భాగ్యం. ఐహిక సంపాదనలన్నింటిలో అది మిక్కిలి విలువైనది. ఆరోగ్యం పోగొట్టుకుని సంపాదించే ధనం, విద్య, ప్రతిష్ఠ నిరకమైనవి. ఆరోగ్యం లేకపోతే వీటిలో ఏదీ ఆనందాన్నివ్వలేదు. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని దుర్వినియోగం చెయ్యటం భయంకరమైన పాపం. అట్టి దుర్వినియోగాలు మనల్ని బలహీన పర్చుతాయి. ఆ విధంగా మనం గొప్ప విద్య సంపాదించినా, అది మనకు నష్టంగానే పరిణమిస్తుంది.CDTel 8.2

    (వచ్చిన వెలుగును నిర్లక్ష్యం చేసినందుకు బాధను అనుభవించిన వారి సాదృశ్యాలు - 119,204)CDTel 8.3

    (1890) C.T.B.H.151 CDTel 8.4

    15. దేవుడు తాను సృజించిన సకల ప్రాణుల పోషణకు సంతోషానికి సమృద్ధిగా ఏర్పాట్లు చేశాడు. ఆయన చట్టాల్ని ఎవరూ ఎన్నడూ అతిక్రమించకుండా ఉంటే, అందరూ దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రవర్తించి ఉంటే దు:ఖం, ఎడతెగని కీడు బదులు ఆరోగ్యం , సమాధానం, సంతోషం ఉండేవి.CDTel 8.5

    హెల్త్ రిఫార్మర్, ఆగస్టు, 1866 CDTel 8.6

    16. దేవుడు మన దేహంలో పెట్టిన చట్టాల ఆచరణ ఆరోగ్యాన్నిస్తుంది. అప్పుడు మన శరీర తత్వానికి విఘాతం కలుగదు.CDTel 8.7

    [వ్యాధి బాధలను తగ్గించటానికి ఆరోగ్య సంస్కరణ ప్రభువు సాధనం- 788]CDTel 8.8

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents