Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    విభాగం XII—గర్భధారణ కాలంలో ఆహారం

    జనన పూర్వ ప్రభావాలు

    (1905) M.H.372,373 CDTel 222.1

    333. అనేకమంది తల్లిదండ్రులు జనన పూర్వ ప్రభావాల ఫలితాల్ని ఎక్కువ ప్రాధాన్యం గల విషయంగా పరిగణించరు. కాని దేవుడు పరిగణిస్తాడు. దేవుడు దూత ద్వారా పంపి అతి గంభీరమైన రీతిగా రెండుసార్లిచ్చిన వర్తమానం మనం అతి జాగ్రత్తగా ఆలోచించటానికి అర్హమైన విషయమని చూపిస్తున్నది.CDTel 222.2

    ఆ హెబ్రీ తల్లితో అన్న మాటల్లో దేవుడు ప్రతీయుగంలోని తల్లులందరితో మాట్లాడుతున్నాడు. “నేను ఆ స్త్రీ తో చెప్పినదంతయు ఆమె చేయవలెను” అని దూత అన్నాడు. బిడ్డ సంక్షేమాన్ని తల్లి అలవాట్లు ప్రభావితం చేస్తాయి. ఆమె తిండి ఉద్రేకాలు నియమం నియంత్రణ కింద ఉండాలి. తనకు బిడ్డనివ్వటంలో దేవుని ఉద్దేశాల్ని నెరవేర్చాలంటే ఆమె విసర్జించవలసింది, వ్యతిరేకించవలసింది ఉంటుంది. బిడ్డ పుట్టక ముందు ఆమెకు వాంఛలు, కోరికలు, స్వార్థం, అసహనం, కాఠిన్యం ఉంటే ఈ గుణలక్షణాలు బిడ్డ తత్వంలో చోటుచేసుకుంటాయి. అధిగమించలేని చెడు ప్రవృత్తుల్ని అనేక మంది బిడ్డలు ఇలా జన్మ హక్కుగా పొందుతారు.CDTel 222.3

    అయితే తల్లి సరియైన నియమాలకి అచంచలంగా నిబద్ధమై ఉంటే ఆమె మితం ఆత్మో పేక్ష పాటిస్తే, దయగా, నమ్రంగా, నిస్వార్ధంగా ఉంటే ఆమె తన బిడ్డకు విలువైన ఈ గుణగణాలు గల ప్రవర్తనను ఇస్తుంది. తల్లి మద్యం ఉపయోగించరాదన్న ఆజ్ఞ అతిస్పష్టంగా ఉంది. తన శారీరక వాంఛను తృప్తి పర్చే ప్రతీ మద్యపు బొట్టు ఆమె బిడ్డ శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యానికి విఘాతం కలిగించి, సృష్టి కర్తకు వ్యతిరేకంగా చేసే పాపమౌతుంది.CDTel 222.4

    కొందరు సలహాదారులు తల్లికోరే ప్రతీ కోర్కెనీ తీర్చాలని, ఆమె ఓ ఆహార పదార్థం కోరితే అది హానికరమైనదైనా దాన్నిచ్చి ఆమె వాంఛను తీర్చాలని చెబుతారు. అలాంటి సలహా తప్పు సలహా. తల్లి శారీరకావసరాల్ని ఏ పరిస్థితుల్లోను అలక్ష్యం చెయ్యకూడదు. ఆమె మీద రెండు ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. ఆమె కోర్కెల్ని మన్నించాలి. ఆమె అవసరాల్ని ఉదారంగా సరఫరా చెయ్యాలి. కానీ అన్ని సమయాల్లో కన్నా ఇప్పుడు ఆహారం విషయంలోను ఇతర విషయాల్లోను శారీరక శక్తిని మానసిక శక్తిని ఏది దెబ్బ తీస్తుందో దాన్ని నివారించాలి. దేవుని ఆజ్ఞ ప్రకారం ఆత్మ నిగ్రహం పాటించటం ఆమె పై వున్న అతి గంభీర బాధ్యత.CDTel 223.1

    (1890) C.T.B.H.37,38 CDTel 223.2

    334. తన ప్రజల విమోచకుడిగా సంసోనుని లేపాలని ప్రభువు ఆకాక్షించి బిడ్డ జననానికి ముందు తల్లికి సరియైన అలవాట్లుండాలని ఆదేశించాడు. మొదటినుంచి బిడ్డ పై కూడా అదే ఆంక్ష విధించబడాల్సి ఉంది. ఎందుకంటే పుట్టినప్పటినుంచి అతడు దేవునికి నాజీరుగా ప్రతిష్ఠితం కావాల్సి ఉన్నాడు.CDTel 223.3

    దేవ దూత మనోహ భార్యకు కనిపించి తనకో కుమారుడు జన్మిస్తాడని తెలియజేశాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆమెకు ఈ ప్రాముఖ్యమైన సూచనలిచ్చాడు: “ద్రాక్ష రసమైనను మద్యమునైనను త్రాగ కూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు.”CDTel 223.4

    మనోహకు వాగ్దానం చేసిన బిడ్డ దేవునికి చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఉన్నది. ఈ పనికి అవసరమైన అర్హతల్ని అతడికి సమకూర్చటానికి తల్లి బిడ్డలిద్దరి అలవాట్లు జాగ్రత్తగా క్రమబద్ధపర్చాల్సి ఉంది. “ఆమె ద్రాక్షారసమైనను, మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమె కాజ్ఞాపించినదంతయు ఆమెను చేకొనవలెను” అన్నది దూత మనోహ భార్యకిచ్చిన ఉపదేశం. తల్లి అలవాట్లు బిడ్డను మంచికో చెడుకో ప్రభావితం చేస్తాయి. ఆమె నియమం అదుపులో ఉంచాలి. తన బిడ్డ శ్రేయాన్ని కోరుకుంటే ఆమె మితాన్ని ఆత్మ నిరసనను పాటించాలి.CDTel 223.5